తెలుగు భీకరుండో మా యెహోవా
పల్లవిభీకరుండౌ మా యెహోవా - పీఠ మెదుటం గూడరే
యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే
1)మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను -
ఇట్టి శక్తుండౌ ప్రభునే - మెచ్చుగా మది నెంతుము
|| భీకరుండౌ ||
2)ఏరితోడు లేక మము స - సర్వేశ్వరుండు సృష్టించెను -
ధారుణిం దా నొక్కండే మా - దైవమని పూజింతుము
|| భీకరుండౌ ||
3)పుట్టగిట్టంజేయ దానై - నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్థులారా - ప్రస్తుతింపరె భక్తిని
|| భీకరుండౌ ||
4)మేటి సంగీతంబులుపై - మింట నారవ మొందను -
జాటరే వేవేల నోళ్లన్ - సన్నుతుల్ ప్రభువందను
|| భీకరుండౌ ||
5)మిక్కిలి కష్టంబులతో - మిత్తికిని బాల్పొందను -
దిక్కులేని గొఱ్ఱెలట్లు - దిరుగ జేర్పన్ మందను
|| భీకరుండౌ ||
English Bheekarumdau Maa Yehovaa
ChorusBheekarundau Maa Yehovaa - Peetha Medutan Goodare
Yekamai Saashtaangapadi Sarvesvaruni Goniyaadare
1)Mattitone Mammu Nella - Maanavuluga Srujinchenu -
Itti Saktundau Prabhune - Mechchugaa Madi Nentumu
|| Bheekarundau ||
2)eritodu Leka Mamu Sa - Sarvesvarundu Srushtinchenu -
Dhaarunin Daa Nokkande Maa - Daivamani Poojintumu
|| Bheekarundau ||
3)Puttagittanjeya Daanai - Natti Devuni Saktini
Battugaa Lokasthulaaraa - Prasthuthinpare Bhaktini
|| Bheekarundau ||
4)Meti Sangeetanbulupai - Minta Naarava Mondanu -
Jaatare Vevela Nollan - Sannutul Prabhuvandanu
|| Bheekarundau ||
5)Mikkili Kashtanbulato - Mittikini Baalpondanu -
Dikkuleni Gorrelatlu - Diruga Jerpan Mandanu
|| Bheekarundau ||