Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 536 Old No: 657

ఏమి చెప్పుదమో మన

Emi Cheppudamo Mana

Open in Word & Worship App
తెలుగు   ఏమి చెప్పుదమో మన
పల్లవి
ఏమి చెప్పుదమో మన ప్రభుకేమి చెప్పుదమో
నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడగుటకు తప్పకవచ్చును
1)
కలహంబులతో కాలయాపనతో కాలమంతయు గడిపితివా
ఒక ఆత్మయినను రక్షించుటకు నీ పనియేదని ప్రభు నిన్నడిగిన
|| ఏమి ||
2)
సంఘకార్య భారములను ఎరుగక సొంతమునకు జీవించెదవా
ఆత్మల రక్షణ ఆవేదన నీ కెందుకు లేదని ప్రభునిన్నడిగిన
|| ఏమి ||
3)
ధనధాన్యంబులు ధర సమృద్ధిని ఇలలో ప్రభు నికిచ్చేగదా
నీరాబడిలో నా సేవకు నీవేమిచ్చితివని ప్రభునిన్నడిగిన
|| ఏమి ||
4)
చెమట రక్తముగ మారునంతగ ప్రభు నీకై ప్రార్థించెగదా
సంఘక్షేమము పొందుట కొరకై నీ ప్రార్థన యేదని ప్రభునిన్నడిగిన
|| ఏమి ||
5)
సిలువలో నీకైమన ప్రభు యేసు బలియై ప్రాణమర్పించెగదా
సువార్తను ప్రకటించుటలో నీ భారము ఏదని ప్రభునిన్నడిగిన
|| ఏమి ||
English   Emi Cheppudamo Mana
Chorus
emi Cheppudamo Mana Prabhukemi Cheppudamo
Nee Naa Sevaku Mana Paricharyaku Lekkaladagutaku Tappakavachchunu
1)
Kalahanbulato Kaalayaapanato Kaalamantayu Gadipitivaa
Oka Aatmayinanu Rakshinchutaku Nee Paniyedani Prabhu Ninnadigina
|| emi ||
2)
Sanghakaarya Bhaaramulanu Erugaka Sontamunaku Jeevinchedavaa
Aatmala Rakshana Aavedana Nee Kenduku Ledani Prabhuninnadigina
|| emi ||
3)
Dhanadhaanyanbulu Dhara Samrddhini Ilalo Prabhu Nikichchegadaa
Neeraabadilo Naa Sevaku Neevemichchitivani Prabhuninnadigina
|| emi ||
4)
Chemata Raktamuga Maarunantaga Prabhu Neekai Praarthinchegadaa
Sanghakshemamu Ponduta Korakai Nee Praarthana Yedani Prabhuninnadigina
|| emi ||
5)
Siluvalo Neekaimana Prabhu Yesu Baliyai Praanamarpinchegadaa
Suvaartanu Prakatinchutalo Nee Bhaaramu edani Prabhuninnadigina
|| emi ||
Present