Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 532 Old No: 589

విశ్వాసము ఎక్కడ

Vishvaasamu Ekkada

Open in Word & Worship App
తెలుగు   విశ్వాసము ఎక్కడ
పల్లవి
విశ్వాసము ఎక్కడ ? నీ విశ్వాసము ఎక్కడ??
నిరీక్షింప బడువాటి నిజస్వరూపమే యది
1)
గాలికి నీళ్ళకు భయపడిరి - కోల్పోయిరి విశ్వాసమును
సృష్టి యావత్తు యేసుదేనని - శిష్యులు గ్రహించలేదుగా
|| వి ||
2)
రక్తస్రావము గలదైన స్త్రీ - అత్తరు పూసిన మరియొక స్తీ
విధవరాలు యిద్దరు మరియల - విశ్వాసమే బలమైనదిగా
|| వి ||
3)
బాగైన రోగుల విశ్వాసం - దానియేలు స్థిరవిశ్వాసం
శతాధిపతి పౌలు సీలల - విశ్వాసమెంతో గొప్పదిగా
|| వి ||
4)
హెబ్రీయులేగా వీరులు - అబ్రహామేగా మూలము
ఆత్మఫలములో నొకభాగం - అన్నిటిలో అతిముఖ్యముగా
|| వి ||
5)
పరిశీలించుకో నీకు నీవే - పరమ ప్రభుని సన్నిధిలో
చూచుకో నీలో నున్నదా - తెచ్చుకోలేకుంటే ఈనాడే
|| వి ||
6)
కపెర్నహూముగానున్నావా? - కఠినమనస్సుతో నున్నవా?
కల్ల నిజము నెరుగవా? - క్రీస్తేసుని విశ్వసించవా?
|| వి ||
English   Vishvaasamu Ekkada
Chorus
Visvaasamu Ekkada ? Nee Visvaasamu Ekkada??
Nireekshinpa Baduvaati Nijasvaroopame Yadi
1)
Gaaliki Neellaku Bhayapadiri - Kolpoyiri Visvaasamunu
Srushti Yaavattu Yesudenani - Sishyulu Grahinchaledugaa
|| Vi ||
2)
Raktasraavamu Galadaina Stree - Attaru Poosina Mariyoka Stee
Vidhavaraalu Yiddaru Mariyala - Visvaasame Balamainadigaa
|| Vi ||
3)
Baagaina Rogula Visvaasan - Daaniyelu Sthiravisvaasam
Sataadhipati Paulu Seelala - Visvaasamento Goppadigaa
|| Vi ||
4)
Hebreeyulegaa Veerulu - Abrahaamegaa Moolamu
Aatmaphalamulo Nokabhaagan - Annitilo Atimukhyamugaa
|| Vi ||
5)
Pariseelinchuko Neeku Neeve - Parama Prabhuni Sannidhilo
Choochuko Neelo Nunnadaa - Techchukolekunte Eenaade
|| Vi ||
6)
Kapernahoomugaanunnaavaa? - Kathinamanassuto Nunnavaa?
Kalla Nijamu Nerugavaa? - Kreestesuni Visvasinchavaa?
|| Vi ||
Present