Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 53 Old No: 56

ఎటుల నీకు స్తుతులోనర్తుము

Etula Neeku Stutulonartumu

Open in Word & Worship App
తెలుగు   ఎటుల నీకు స్తుతులోనర్తుము
పల్లవి
ఎటుల నీకు స్తుతు లొనర్తుము - యోహోవ తనయ - యెటుల
నీకు నుతు లొనర్తుము - పటుతర పాపంబులనెడి - పంకమందుఁ జిక్కి
మదిని - దిటము జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁ జూపినట్టి యేసూ
1)
పాపకూపమందు నుండగాం - బాపవిమోచ-దాపుంజేర్చి కాపుం
జూపితి - శాపగ్రస్తులైన మా - శాపము విముక్తింజేయు -
నీ పవిత్ర రక్తమే నా - ప్రాపుగా ఒసంగితివి
|| ఎటు ||
2)
భారభరితమైన యాత్మల - భారమును దీసి - భూరి సౌఖ్యములతో
నింపను - భారకుండ - ఘోరమైన శ్రమలనొంది - మరణమొంది
తిరిగిలేచి నీవు ధాత్రి - మహిమ నొందినట్టి దేవ
|| ఎటు ||
3)
నీతిహీనులమై యుండంగా - నో కర్త మాదు - భీతులన్నిం బాపినీ
కృపన్‌ - నీతి రక్షణ వస్త్రములను - భాతిగ ధరింపంజేసి
భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింపజేంసితి
|| ఎటు ||
4)
నిన్నుంజేరి నిర్మలుండనై - యీ భూమియందు - నిన్నుం బోలి
నడుచుకొనుటకై - తిన్నని మార్గములను జూపి - అన్ని కీడులను
జయింపం బన్నుంగ విమలాత్మశక్తి - సున్నితముంగ నిడిన యేసూ
|| ఎటు ||
5)
పరమ రాజ్యమందు నిరతము - నీ తోడునుండం - కరుణతోడ
నెంచు కొంటివి - తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుం
త్వరగం జేర్చియందు సుఖము-దిరముగా నొసంగుదేవ
|| ఎటు ||
English   Etula Neeku Stutulonartumu
Chorus
Etula Neeku Stutu Lonartumu - Yohova Tanaya - Yetula
Neeku Nutu Lonartumu - Patutara Paapanbulanedi - Pankamandun Jikki
Madini - Ditamu Jedina Mammun Brochi Dikkun Joopinatti Yesoo
1)
Paapakoopamandu Nundagaan - Baapavimocha-Daapunjerchi Kaapum
Joopiti - Saapagrastulaina Maa - Saapamu Vimuktinjeyu -
Nee Pavitra Raktame Naa - Praapugaa Osangitivi
|| Etu ||
2)
Bhaarabharitamaina Yaatmala - Bhaaramunu Deesi - Bhoori Saukhyamulato
Ninpanu - Bhaarakunda - Ghoramaina Sramalanondi - Maranamondi
Tirigilechi Neevu Dhaatri - Mahima Nondinatti Deva
|| Etu ||
3)
Neetiheenulamai Yundangaa - No Karta Maadu - Bheetulannin Baapinee
Krupan - Neeti Rakshana Vastramulanu - Bhaatiga Dharinpanjesi
Bhootalanbunandu Ninnu Khyaatiga Sevinpajensiti
|| Etu ||
4)
Ninnunjeri Nirmalundanai - Yee Bhoomiyandu - Ninnun Boli
Naduchukonutakai - Tinnani Maargamulanu Joopi - Anni Keedulanu
Jayinpan Bannunga Vimalaatmasakti - Sunnitamunga Nidina Yesoo
|| Etu ||
5)
Parama Raajyamandu Niratamu - Nee Todunundan - Karunatoda
Nenchu Kontivi - Tirigi Vachchi Mammunu Mee Chiraprakaasa Puramunandum
Tvaragan Jerchiyandu Sukhamu-Diramugaa Nosangudeva
|| Etu ||
Present