Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 523

నన్ను చూచినట్టి వారు

Nannu Chuchinatti Vaaru

Open in Word & Worship App
తెలుగు   నన్ను చూచినట్టి వారు
పల్లవి
నన్ను జూచునట్టివారు - నిన్ను గాంచగలుగు నటుల
నాలో నివసించుమా - నీవే కనిపించుమా నీతో నడిపించుమా
1)
యేసు ప్రభువు కల్వరిలో - రక్తమిచ్చి కొన్నాడని
తన బిడ్డగ నన్ను జేసి - మనశ్శాంతి నిచ్చెనని ఘనరక్షకుడవు నీవని
|| నన్ను ||
2)
పాత రోత చేతలతో - పాతిపెట్టబడితినని
క్రీస్తులోన తిరిగి పుట్టి - నూతన సృష్టయితినని ఈ జనులకు తెలియనటుల
|| నన్ను ||
3)
నీ పోలికయైన నేను - మాలికగా నీ మాటలు
నిరతము ధరితింతునని - నీవే నా సర్వమని నిన్నే ప్రచురింతునని
|| నన్ను ||
4)
నీ ఓర్పును నేర్పితివని - దీనునిగా జేసితివని
పరిశోధన కొలిమిలోన - సాధనముగ మలచితివని ఈ లోకము ఎరుగునటుల
|| నన్ను ||
5)
నేను కాదు నా బ్రతుకున - క్రీస్తే జీవించునని
చావైనను లాభమని - నీ రాజ్య ప్రవేశమని నీవే ఆ మార్గమని
|| నన్ను ||
English   Nannu Chuchinatti Vaaru
Chorus
Nannu Joochunattivaaru - Ninnu Gaanchagalugu Natula
Naalo Nivasinchumaa - Neeve Kanipinchumaa Neeto Nadipinchumaa
1)
Yesu Prabhuvu Kalvarilo - Raktamichchi Konnaadani
Tana Biddaga Nannu Jesi - Manassaanti Nichchenani Ghanarakshakudavu
Neevani
|| Nannu ||
2)
Paata Rota Chetalato - Paatipettabaditinani
Kreestulona Tirigi Putti - Nootana Srushtayitinani Ee Janulaku
Teliyanatula
|| Nannu ||
3)
Nee Polikayaina Nenu - Maalikagaa Nee Maatalu
Niratamu Dharitintunani - Neeve Naa Sarvamani Ninne Prachurintunani
|| Nannu ||
4)
Nee Orpunu Nerpitivani - Deenunigaa Jesitivani
Parisodhana Kolimilona - Saadhanamuga Malachitivani Ee Lokamu
Erugunatula
|| Nannu ||
5)
Nenu Kaadu Naa Bratukuna - Kreeste Jeevinchunani
Chaavainanu Laabhamani - Nee Raajya Pravesamani Neeve Aa Maargamani
|| Nannu ||
Present