తెలుగు స్తుతి చేయవే క్రీస్తుని
పల్లవిస్తుతి చేయవె క్రీస్తుని - నా మనసా
ప్రతిదినము ప్రభుని సన్నిధిలో (2 సార్లు)
1)మనపాపములకై ఆ ప్రభువే - కలువరి సిలువను మోసెనుగా
సిలువలో ప్రభువు మరణించి - మృతి గెల్చి తిరిగి లేచెనుగా
|| స్తుతి ||
2)ఓ పాపి రావా ప్రభు కడకు - నీ పాపములన్ని ఒప్పుకొనుము
నమ్మదగినవాడు నీతిమంతుడు - నీ పాపములన్నీ క్షమియించును
|| స్తుతి ||
3)గాఢాంధకారపు లోయలలో - దుడ్డు కర్రయు దండము ఆదరించును
ఆ పచ్చిక కలిగిన చోట్లలో - ప్రభు జీవజలములలో నడిపించును
|| స్తుతి ||
4)ఆ పగటి కాలములో పౌలు - డేరాలు కుట్టి జీవించెనుగా
అర్ధరాత్రివేళ ఆ పౌలు మోకాళ్ళపై మొఱ్ఱపెట్టెనుగా
|| స్తుతి ||
5)ఆ రాత్రివేళ యాకోబు - పెనూయేలులో పోరాడెనుగా
ఆ తెల్లవారు జామున ఇశ్రాయేలని పిలుపొందెనుగా
|| స్తుతి ||
English Stuti Cheyave Kreestuni
ChorusSthuthi Cheyave Kreestuni - Naa Manasaa
Pratidinamu Prabhuni Sannidhilo (2 Saarlu)
1)Manapaapamulakai Aa Prabhuve - Kaluvari Siluvanu Mosenugaa
Siluvalo Prabhuvu Maraninchi - Mrti Gelchi Tirigi Lechenugaa
|| Sthuthi ||
2)O Paapi Raavaa Prabhu Kadaku - Nee Paapamulanni Oppukonumu
Nammadaginavaadu Neetimantudu - Nee Paapamulannee Kshamiyinchunu
|| Sthuthi ||
3)Gaadhaandhakaarapu Loyalalo - Duddu Karrayu Dandamu Aadarinchunu
Aa Pachchika Kaligina Chotlalo - Prabhu Jeevajalamulalo Nadipinchunu
|| Sthuthi ||
4)Aa Pagati Kaalamulo Paulu - Deraalu Kutti Jeevinchenugaa
Ardharaatrivela Aa Paulu Mokaallapai Morrapettenugaa
|| Sthuthi ||
5)Aa Raatrivela Yaakobu - Penooyelulo Poraadenugaa
Aa Tellavaaru Jaamuna Israayelani Pilupondenugaa
|| Sthuthi ||