తెలుగు యాత్రికుడా సైనికుడా
పల్లవియాత్రికుడా! సైనికుడా ప్రభువు మాట చొప్పున
పయనించేవాడా - శత్రువైన సాతానుని ఎదరించేవాడా
1)పాపపు ఐగుప్తునుండి దాటియుంటివి - ప్రభు విచ్చిన దేశమునకు
సాగుచుంటివి కష్టాలకొండలా ? కరముబట్టి ఎక్కించును
కన్నీటి లోయలా ? కరుణతోడ దాటించును - నీకుముందు
నడుచును నీకు రక్షణిచ్చును
|| యా ||
2)అరణ్యమనే సాకుతో అడ్డదారి తొక్కబోకు ఆయనపై
తొందరపడి సణుగుచుండకు - కడలిపొంగు వచ్చిన నడువగ
దారిచ్చును కరువు సంభవించినా? మరువక పోషించును
ఎన్ని అవాంతరములైన యేసు నీతోనున్నాడు
|| యా ||
3)మధురంబగు మన్నా మన ప్రభుసన్నిధి మానకు - మరులు
గొలుపు లోకాశ ఆకులనే కోరకు తిండిపోతుగా మారి తినుటకు
కూర్చుండకు - అల్లరైన చేతులతో ఆడుటకు లేవకు మత్తులోన
చిక్కి ఆత్మనష్టము కొని తెచ్చుకోకు
|| యా ||
4)ఎడారిలో పయనమని ఏమియు భయపడకోయి ఎండతీక్షణం బైన
బండగా నీలళ్ళిచ్చునోయి అంధకార - సమయమా? వెలుగుదారి
చూపునోయి! ఆపదల వలయమా ? విడువడు ఎడబాయడోయి
తప్పిజారిపడిపోతే తప్పంతా నీదేనోయి
|| యా ||
English Yaatrikudaa Sainikudaa
ChorusYaatrikudaa! Sainikudaa Prabhuvu Maata Choppuna
Payaninchevaadaa - Satruvaina Saataanuni Edarinchevaadaa
1)Paapapu Aiguptunundi Daatiyuntivi - Prabhu Vichchina Desamunaku
Saaguchuntivi Kashtaalakondalaa ? Karamubatti Ekkinchunu
Kanneeti Loyalaa ? Karunatoda Daatinchunu - Neekumundu
Naduchunu Neeku Rakshanichchunu
|| Yaa ||
2)Aranyamane Saakuto Addadaari Tokkaboku Aayanapai
Tondarapadi Sanuguchundaku - Kadalipongu Vachchina Naduvaga
Daarichchunu Karuvu Sanbhavinchinaa? Maruvaka Poshinchunu
Enni Avaantaramulaina Yesu Neetonunnaadu
|| Yaa ||
3)Madhuranbagu Mannaa Mana Prabhusannidhi Maanaku - Marulu
Golupu Lokaasa Aakulane Koraku Tindipotugaa Maari Tinutaku
Koorchundaku - Allaraina Chetulato Aadutaku Levaku Mattulona
Chikki Aatmanashtamu Koni Techchukoku
|| Yaa ||
4)Edaarilo Payanamani emiyu Bhayapadakoyi Endateekshanan Baina
Bandagaa Neelallichchunoyi Andhakaara - Samayamaa? Velugudaari
Choopunoyi! Aapadala Valayamaa ? Viduvadu Edabaayadoyi
Tappijaaripadipote Tappantaa Needenoyi
|| Yaa ||