తెలుగు విజయ గీతముల్ పాడరే
పల్లవివిజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్
పాడరే - వృజిన మంతటి మీద - విజయమిచ్చెడు దేవ -
నిజకుమారుని నామమున్ - హృదయములతో - భజన జేయుచు నిత్యమున్
1)మంగళముగ యేసుండే - మనకు రక్షణ - శృంగమై మరి నిల్చెను -
నింగిన్ విడిచివచ్చెను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను -
రంగు మీరంగదన - రక్త బలము వలన - పొంగు
నణగ జేసెను - సాతునుని - బల్ - క్రుంగ నలిపి చీల్చెను
|| విజయ ||
2)పాపముల్ దొలగింపను - మనలను దన స్వ-రూపంబునకు
మార్చను - శాపం బంతయు నోర్చెను - దేవుని న్యాయ-కోపము
భరియించెను - పాప మెరుంగని యేసు - పాపమై మనకొరకు -
పాపయాగము దీర్చెను - దేవుని నీతిన్ - ధీరుండై నెరవేర్చెను
|| విజయ ||
3)సిలువ మరణము నొందియు - మనలను దనకై గెలువన్ లేచిన
వానికి - చెలువుగన్ విమలాత్ముని - ప్రేమను మనలో - నిలువన్
జేసినవానికిం - కొలువుం జేతుమెగాని - ఇలను మరువక వాని
సిలువ మోయుచు నీ కృపా-రక్షణ చాల- విలువ గలదని చాటుచు
|| విజయ ||
English Vijaya Geetamul Paadare
ChorusVijaya Geetamul Paadare - Kreestuku Jaya - Vijaya Geetamul
Paadare - Vrujina Mantati Meeda - Vijayamichchedu Deva -
Nijakumaaruni Naamamun - Hrudayamulato - Bhajana Jeyuchu Nityamun
1)Mangalamuga Yesunde - Manaku Rakshana - Srngamai Mari Nilchenu -
Ningin Vidichivachchenu - Satruni Yudha - Rangamanduna Gelchenu -
Rangu Meerangadana - Rakta Balamu Valana - Pongu
Nanaga Jesenu - Saatununi - Bal - Krunga Nalipi Cheelchenu
|| Vijaya ||
2)Paapamul Dolaginpanu - Manalanu Dana Sva-Roopanbunaku
Maarchanu - Saapan Bantayu Norchenu - Devuni Nyaaya-Kopamu
Bhariyinchenu - Paapa Merungani Yesu - Paapamai Manakoraku -
Paapayaagamu Deerchenu - Devuni Neetin - Dheerundai Neraverchenu
|| Vijaya ||
3)Siluva Maranamu Nondiyu - Manalanu Danakai Geluvan Lechina
Vaaniki - Cheluvugan Vimalaatmuni - Premanu Manalo - Niluvan
Jesinavaanikin - Koluvun Jetumegaani - Ilanu Maruvaka Vaani
Siluva Moyuchu Nee Krupaa-Rakshana Chaala- Viluva Galadani Chaatuchu
|| Vijaya ||