తెలుగు క్రైస్తవులారా క్రైస్తవులారా
పల్లవిక్రైస్తవులారా - క్రైస్తవులారా, క్రీస్తునిబోలి
నడువదేల? - ప్రభు క్రీస్తుయేసు కొరకు నిల్వరా
1)మారుమనస్సు పొందుకున్న - చేరరు పరలోకము
మారుమనస్సు లేకను - మార్చలేరు ప్రజలను
కోరి నూతనాత్మ నొందుడి - వేసారి ఆత్మలను రక్షించుడి
|| క్రైస్తవ ||
2)సుళువుగా చిక్కులను బెట్టు - పాపముల త్యజించుడి
సుళువుగా ప్రభు కాడిని - తలలువంచి మోయుడి
ఇరుకు మార్గమందు నడుపుడి - వేసారి ఆత్మలను రక్షించుడి
|| క్రైస్తవ ||
3)ఆత్మలెన్నో అనుదినంబు - అవనిలో నశింపగన్
హాయిగా సుఖింతురా - వారిని రక్షింపరా
ఒక్క ఆత్మనైన గావరా - ప్రభులెక్క యడుగునని యెరుంగరా
|| క్రైస్తవ ||
4)అంత్యకాల గురుతులు - కడువింతగ నెరవేరుచుండె
అంత్య క్రీస్తు నీడలు - అంతట కనుపించుచుండె
ఇంతటి నిస్సారపు బ్రతుకే కాలమంతయు నీకు
|| క్రైస్తవ ||
5)క్రీస్తు భక్తులెత్తబడెడు - కాలము ఏతెంచెను
క్రీస్తు మహిమతోడ వచ్చు - సమయము అరుదెంచెను
మీరు విడువబడుట ఘోరము - తప్పించుకొనుడి శ్రమకాలము
|| క్రైస్తవ ||
English Kraistuvulaaraa Kraistuvulaaraa
ChorusKraistavulaaraa - Kraistavulaaraa, Kreestuniboli
Naduvadela? - Prabhu Kreestuyesu Koraku Nilvaraa
1)Maarumanassu Pondukunna - Cheraru Paralokamu
Maarumanassu Lekanu - Maarchaleru Prajalanu
Kori Nootanaatma Nondudi - Vesaari Aatmalanu Rakshinchudi
|| Kraistava ||
2)Suluvugaa Chikkulanu Bettu - Paapamula Tyajinchudi
Suluvugaa Prabhu Kaadini - Talaluvanchi Moyudi
Iruku Maargamandu Nadupudi - Vesaari Aatmalanu Rakshinchudi
|| Kraistava ||
3)Aatmalenno Anudinanbu - Avanilo Nasinpagan
Haayigaa Sukhinturaa - Vaarini Rakshinparaa
Okka Aatmanaina Gaavaraa - Prabhulekka Yadugunani Yerungaraa
|| Kraistava ||
4)Antyakaala Gurutulu - Kaduvintaga Neraveruchunde
Antya Kreestu Needalu - Antata Kanupinchuchunde
Intati Nissaarapu Bratuke Kaalamantayu Neeku
|| Kraistava ||
5)Kreestu Bhaktulettabadedu - Kaalamu etenchenu
Kreestu Mahimatoda Vachchu - Samayamu Arudenchenu
Meeru Viduvabaduta Ghoramu - Tappinchukonudi Sramakaalamu
|| Kraistava ||