తెలుగు ఫలములను కోరెను
పల్లవిఫలములను కోరెను - ప్రభువే తన జనులను ఫలియింప కృపజూపును
1)కొమ్మగ నిన్ను కొని తెచ్చెను - తనదు తోటలో నాటి పెంచెను
చెట్టుగ ఎదిగిన నిన్ను అడుగును - ఫలముల కొరకై ప్రభువు
ఏమిత్తువో మరి నీవు
|| ఫల ||
2)కాని ఫలములను కాచెదవేమో - కఠిన శిక్షపాలయ్యెదవేమో
నీతి రాజులో నిలిచి యుండుమా - నిండుగా ఫలియించెదవు
పచ్చగా జీవించెదవు
|| ఫల ||
3)ఆకలి తీర్చని అంజూర చెట్టువా - మాటలనెడి ఆకులతో -
నిండితివా - ఆశాభంగము చెందును ప్రభువు - అవమానము -
నొందెదవు - అటుపై నీ వెండెదవు
|| ఫల ||
4)సంఘమనెడు ఉద్యానవనంబున - ప్రియుని రాకకై ఎదురు
చూచుచూ - ఆయన కిష్టమౌ ఆత్మఫలమును - ఆసక్తితో
ఫలియించు - ప్రభుకే నీ వందించు
|| ఫల ||
5)గొడ్డలి చెట్టు వేరునున్నది - నరికి వేయుటకు వేచియున్నది
పాదుచేయగా ఎరువు వేయగా - పావన యేసునివేడు
బహుగా ఫలింతువు చూడు
|| ఫల ||
English Phalamulanu Korenu
ChorusPhalamulanu Korenu - Prabhuve Tana Janulanu Phaliyinpa Krupajoopunu
1)Kommaga Ninnu Koni Techchenu - Tanadu Totalo Naati Penchenu
Chettuga Edigina Ninnu Adugunu - Phalamula Korakai Prabhuvu
emittuvo Mari Neevu
|| Phala ||
2)Kaani Phalamulanu Kaachedavemo - Kathina Sikshapaalayyedavemo
Neeti Raajulo Nilichi Yundumaa - Nindugaa Phaliyinchedavu
Pachchagaa Jeevinchedavu
|| Phala ||
3)Aakali Teerchani Anjoora Chettuvaa - Maatalanedi Aakulato -
Ninditivaa - Aasaabhangamu Chendunu Prabhuvu - Avamaanamu -
Nondedavu - Atupai Nee Vendedavu
|| Phala ||
4)Sanghamanedu Udyaanavananbuna - Priyuni Raakakai Eduru
Choochuchoo - Aayana Kishtamau Aatmaphalamunu - Aasaktito
Phaliyinchu - Prabhuke Nee Vandinchu
|| Phala ||
5)Goddali Chettu Verununnadi - Nariki Veyutaku Vechiyunnadi
Paaducheyagaa Eruvu Veyagaa - Paavana Yesunivedu
Bahugaa Phalintuvu Choodu
|| Phala ||