Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 510 Old No: 244

ఓహో క్రైస్తవుడా! జయ

Oho Kraistuvudaa! Jaya

Open in Word & Worship App
తెలుగు   ఓహో క్రైస్తవుడా! జయ
పల్లవి
ఓహో! క్రైస్తవుడా! జయజీవితమేది? జల్లించెను సాతాను
నిన్ను - జారితివే ! మరి వేసారితివే
1)
విజయముగ బ్రతుకును వృజినముపై - నిజదైవము నిను -
సృజియించెనుగా - జారితివే ! వేసారితివే ! వెనుకాడిన
నీ - వేషము వీడు
|| ఓహో ||
2)
సాతానుని ఒడిలో నిదురించి - సర్వేశుని బోధలు ఎదిరించి
మానసము మసిగారినను - మలినమును మలుపగ లేవా?
|| ఓహో ||
3)
గద్దించెడు మనస్సాక్షిని ద్రోసి - ఘన దేవుని మార్గములను రోసి
దాస్యమను - ధనమోహమును - దాహముతో ద్రాగెదవేమి?
|| ఓహో ||
4)
ఆత్మలో ఆనందము అణగారి - ఆవేశములేకను దిగజారి
అన్నిటిలో అధికుడననుచు - ఆర్భాటము చేసెదవేమి?...
|| ఓహో ||
5)
ఎన్నో మేలులు తరుణములు - యేసు నీకివ్వగ కరుణించి
తామసము మరిజేయకను - తండ్రి కౌగిలి జేరుమిక...
|| ఓహో ||
English   Oho Kraistuvudaa! Jaya
Chorus
Oho! Kraistavudaa! Jayajeevitamedi? Jallinchenu Saataanu
Ninnu - Jaaritive ! Mari Vesaaritive
1)
Vijayamuga Bratukunu Vrujinamupai - Nijadaivamu Ninu -
Srujiyinchenugaa - Jaaritive ! Vesaaritive ! Venukaadina
Nee - Veshamu Veedu
|| Oho ||
2)
Saataanuni Odilo Nidurinchi - Sarvesuni Bodhalu Edirinchi
Maanasamu Masigaarinanu - Malinamunu Malupaga Levaa?
|| Oho ||
3)
Gaddinchedu Manassaakshini Drosi - Ghana Devuni Maargamulanu Rosi
Daasyamanu - Dhanamohamunu - Daahamuto Draagedavemi?
|| Oho ||
4)
Aatmalo Aanandamu Anagaari - Aavesamulekanu Digajaari
Annitilo Adhikudananuchu - Aarbhaatamu Chesedavemi?...
|| Oho ||
5)
Enno Melulu Tarunamulu - Yesu Neekivvaga Karuninchi
Taamasamu Marijeyakanu - Tandri Kaugili Jerumika...
|| Oho ||
Present