తెలుగు నీతిసూర్యుడు యేసు
పల్లవినీతి సూర్యుడు యేసు - నిన్ను వెలిగించగను
నీవెచట నున్నానో? - నిలిచి యోచించుమా
1)రారాజు వెలిగించినట్టి ఓ దీపమా!
మంచమను మత్తులో - మతిమాలియున్నావా ?
కుంచమను కులమతము - మూసియుంచేనా?
చంచలముగానున్న - చెడిపోయెదవు సుమా!
|| నీతి ||
2)వెలుగునిచ్చుట మాని - చీకటితో స్నేహమా!
వెలుగుచుండేటి - పని అది ఎంతో భారమా?
కొడగట్టి నీ కాంతి - కొరతగా నుండకుమా-
పడిపోయెదవు కునికి - తడవుచేయక మేల్కొ
|| నీతి ||
3)ఎత్తయిన స్థలములో - నిలిచి వెలుగిచ్చుటకు
నిత్యుడగు తండ్రి నిను - నియమించెనని ఎరిగి
ప్రజ్వలించుచు నీవు - ప్రభువు నొద్దకురాని
జనములకు నీ కాంతి - జూపి రప్పించుమా
|| నీతి ||
4)ఆత్మతైలము తోడ - అనుదినము నిండుకో
విశ్వాసమను వత్తి - ఎగదోసి పెంచుకో
సాక్ష్యమను ఉన్నత - శిఖరాగ్రమున నిలిచి
రక్షకుని శుభవార్త - కాంతినే వెదజల్లు
|| నీతి ||
5)కటిక చీకటి జనము - లను కమ్ముచున్నది
తేజరిల్లుము నీదు - తేటైన వెలుగుతో
నిజమైన వెలుగగు - నిర్మలాత్ముని కృపతో
జనములందరు నీదు - వెలుగునకు వచ్చెదరు
|| నీతి ||
English Neethisooryudu Yesu
ChorusNeeti Sooryudu Yesu - Ninnu Veliginchaganu
Neevechata Nunnaano? - Nilichi Yochinchumaa
1)Raaraaju Veliginchinatti O Deepamaa!
Manchamanu Mattulo - Matimaaliyunnaavaa ?
Kunchamanu Kulamatamu - Moosiyunchenaa?
Chanchalamugaanunna - Chedipoyedavu Sumaa!
|| Neeti ||
2)Velugunichchuta Maani - Cheekatito Snehamaa!
Veluguchundeti - Pani Adi Ento Bhaaramaa?
Kodagatti Nee Kaanti - Koratagaa Nundakumaa-
Padipoyedavu Kuniki - Tadavucheyaka Melko
|| Neeti ||
3)Ettayina Sthalamulo - Nilichi Velugichchutaku
Nityudagu Tandri Ninu - Niyaminchenani Erigi
Prajvalinchuchu Neevu - Prabhuvu Noddakuraani
Janamulaku Nee Kaanti - Joopi Rappinchumaa
|| Neeti ||
4)Aatmatailamu Toda - Anudinamu Ninduko
Visvaasamanu Vatti - Egadosi Penchuko
Saakshyamanu Unnata - Sikharaagramuna Nilichi
Rakshakuni Subhavaarta - Kaantine Vedajallu
|| Neeti ||
5)Katika Cheekati Janamu - Lanu Kammuchunnadi
Tejarillumu Needu - Tetaina Veluguto
Nijamaina Velugagu - Nirmalaatmuni Krupato
Janamulandaru Needu - Velugunaku Vachchedaru
|| Neeti ||