తెలుగు విశ్వాసమే విజయము
పల్లవివిశ్వాసమే విజయము - విను ప్రియుఁడా య
విశ్వాస మపజయము విశ్వాసాయుతమైన - విసుకని సుకార్యములే
విశ్వాసవంతునికి - విజయ మొసఁగును నిజము
1)భక్తుఁ డందువలన నే - బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును
యుక్తముగ వర్తించి యుర్విని జయించి
ముక్తి నొందున టంచు - రక్తిగాఁ బాడును
|| విశ్వాసమే ||
2)మంచి పేరు నొందును - సాతాను నెదిరించి విజయ మొందును
మించిన బాధ ల్స - హించి జయించును
నంచిత మరణము - నానందముగఁగాంచు
|| విశ్వాసమే ||
3)ప్రవిమల మొందెదము - పాపమునుండి పరిహరింపఁబడుదుము
1అవిరతమును మనము నాశ్చర్యముగ ఘనము
భువి యందు దివియందు 2బుధులతో నొందుదుము
|| విశ్వాసమే ||
4)నీతిమంతుల మౌదుము - నిశ్చయము ప్రఖ్యాతి బోధను నేర్తుము
ఆతండ్రి దత్తముల - నన్ని యార్జించుచు
యాతని సుభద్రములో - ననయ ముందుము నిజము
|| విశ్వాసమే ||
5)పరిపూర్ణ విశ్వాసమే - క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే
ధరయందు బరమండదు - ధన్యాత్మునిగఁ జేయున్
3సురగు నద్దానినే - సంపాదించుము ప్రియుఁడా
1 ఎల్లప్పుడు
2 పరిశుద్ధులతో
3 తొందరగా
|| విశ్వాసమే ||
English Vishvaasame Vijayamu
ChorusVisvaasame Vijayamu - Vinu Priyundaa Ya
Visvaasa Mapajayamu Visvaasaayutamaina - Visukani Sukaaryamule
Visvaasavantuniki - Vijaya Mosangunu Nijamu
1)Bhaktun Danduvalana Ne - Bratukunu Mariyu Saktinondi Nilchunu
Yuktamuga Vartinchi Yurvini Jayinchi
Mukti Nonduna Tanchu - Raktigaan Baadunu
|| Visvaasame ||
2)Manchi Peru Nondunu - Saataanu Nedirinchi Vijaya Mondunu
Minchina Baadha Lsa - Hinchi Jayinchunu
Nanchita Maranamu - Naanandamugangaanchu
|| Visvaasame ||
3)Pravimala Mondedamu - Paapamunundi Pariharinpanbadudumu
1aviratamunu Manamu Naascharyamuga Ghanamu
Bhuvi Yandu Diviyandu 2budhulato Nondudumu
|| Visvaasame ||
4)Neetimantula Maudumu - Nischayamu Prakhyaati Bodhanu Nertumu
Aatandri Dattamula - Nanni Yaarjinchuchu
Yaatani Subhadramulo - Nanaya Mundumu Nijamu
|| Visvaasame ||
5)Paripoorna Visvaasame - Kriyalato Nunna Mari Manchi Visvaasame
Dharayandu Baramandadu - Dhanyaatmunigan Jeyun
3suragu Naddaanine - Sanpaadinchumu Priyundaa
1 Ellappudu
2 Parisuddhulato
3 Tondaragaa
|| Visvaasame ||