తెలుగు క్రైస్తవ కర్తకా
పల్లవిక్రైస్తవకర్షక కదలిరావయ్యా - కన్నులు తెరచి కానవేమయ్యా
కోతకాలము గతించిపోయె - గ్రీష్మకాలముకూడ జరిగిపోయె
1)మనుష్యకుమారుడైన క్రీస్తు యేసు - మంచి విత్తనమును విత్తెమున్ను
భూలోకంబనెడు పొలంబునందున - వాక్యంబనె విత్తనంబు విత్తెను
|| క్రైస్తవ ||
2)ఆదిమ క్రైస్తవ బోధకులు - వేదనతోను వాక్యంబు విత్తె
రోదనతోను రక్తంబును గార్చి - ప్రాణంబులను దానంబుజేసిరి
|| క్రైస్తవ ||
3)చల్లిన వాక్యము ఫలియింపను - తొలకరి వర్షము గురిపించెను
విలువైన ఫలములు ఫలియించువరకు - కడవరి వర్షము కొరకు వేడుదం
|| క్రైస్తవ ||
4)పొలములు తెల్లబారె తేరిచూడు - కాలము చాల గతించిపోయె
కోతయజమానుడైన క్రీస్తుని - కోతవారిని పంప కోరివేడుదం
|| క్రైస్తవ ||
5)శత్రువగు సాతాను కూడా - చెడ్డవిత్తనాలు చల్లిపోయె
గోధుమలమధ్య గురుగులుకూడా - ఘోరంబుగాను పెరుగుచుండెను
|| క్రైస్తవ ||
6)కన్నీళ్ళతో విత్తు క్రెస్తవుడా - కలవర మొందెద వెందులకు
సంతోషముతో సంగీతాలతోను - సాగిపోవుదము ఆగిపోకను
|| క్రైస్తవ ||
English Kraistava Kartakaa
ChorusKraistavakarshaka Kadaliraavayyaa - Kannulu Terachi Kaanavemayyaa
Kotakaalamu Gatinchipoye - Greeshmakaalamukooda Jarigipoye
1)Manushyakumaarudaina Kreestu Yesu - Manchi Vittanamunu Vittemunnu
Bhoolokanbanedu Polanbunanduna - Vaakyanbane Vittananbu Vittenu
|| Kraistava ||
2)Aadima Kraistava Bodhakulu - Vedanatonu Vaakyanbu Vitte
Rodanatonu Raktanbunu Gaarchi - Praananbulanu Daananbujesiri
|| Kraistava ||
3)Challina Vaakyamu Phaliyinpanu - Tolakari Varshamu Guripinchenu
Viluvaina Phalamulu Phaliyinchuvaraku - Kadavari Varshamu Koraku Vedudan
|| Kraistava ||
4)Polamulu Tellabaare Terichoodu - Kaalamu Chaala Gatinchipoye
Kotayajamaanudaina Kreestuni - Kotavaarini Panpa Korivedudan
|| Kraistava ||
5)Satruvagu Saataanu Koodaa - Cheddavittanaalu Challipoye
Godhumalamadhya Gurugulukoodaa - Ghoranbugaanu Peruguchundenu
|| Kraistava ||
6)Kanneellato Vittu Krestavudaa - Kalavara Mondeda Vendulaku
Santoshamuto Sangeetaalatonu - Saagipovudamu Aagipokanu
|| Kraistava ||