తెలుగు ధరించుకో దేవుని కవచాన్ని
పల్లవిధరించుకో దేవుని కవచాన్ని - దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని
ప్రభువు మహాశక్తి యందు బలమొందుటకై
ప్రభువు యేసు పక్షమందు పోరాడుటకై
1)నీ మనస్సు అనే నడుము నీవు కట్టుకో
సత్యవాక్యమనే దట్టీతో కట్టుకో
స్వనీతి మలిన వస్త్రాల్ని వదులుకో
దేవుని నీతి అనే మైమరువు తొడుగుకో
|| ధరించుకో ||
2)విశ్వాసమనే డాలు చేత పట్టుకో
విరోధి అగ్ని బాణములను అడ్డుకో
దేవునికి ఇష్టుడవై సాగిపో
యుద్ధసన్నద్ధుడవై మున్ముందుకుపో
|| ధరించుకో ||
3)రక్షణ శిరస్త్రాణము ధరియించుకో
దేవుని భయమును నీలో పెంచుకో
పాపము దరి చేరకుండ కాచుకో
అపజయమే లేదు మరి చూచుకో
|| ధరించుకో ||
4)ధరించుకో ధైవవాక్యఖడ్గాన్ని
వాడిగల సజీవ ఆత్మఖడ్గాన్ని
ఎదిరించుము అపవాది తంత్రాన్ని
జయించుము సాతాను సైన్యాన్ని
|| ధరించుకో ||
5)సువార్త ఇచ్చు సిద్ధమనసు జోడు తొడుగుకో
క్రీస్తు ప్రభుని అడుగుజాడ చూచి నడుచుకో
క్రీస్తుయేసు మనసు కలిగియుండ నేర్చుకో
తండ్రి కిష్టమైనదెల్ల చేయబూనుకో
|| ధరించుకో ||
English Dharinchuko Devuni Kavachaanni
ChorusDharinchuko Devuni Kavachaanni - Devudichchu Sarvaanga Kavachaanni
Prabhuvu Mahaasakti Yandu Balamondutakai
Prabhuvu Yesu Pakshamandu Poraadutakai
1)Nee Manassu Ane Nadumu Neevu Kattuko
Satyavaakyamane Datteeto Kattuko
Svaneeti Malina Vastraalni Vaduluko
Devuni Neeti Ane Maimaruvu Toduguko
|| Dharinchuko ||
2)Visvaasamane Daalu Cheta Pattuko
Virodhi Agni Baanamulanu Adduko
Devuniki Ishtudavai Saagipo
Yudhasannaddhudavai Munmundukupo
|| Dharinchuko ||
3)Rakshana Sirastraanamu Dhariyinchuko
Devuni Bhayamunu Neelo Penchuko
Paapamu Dari Cherakunda Kaachuko
Apajayame Ledu Mari Choochuko
|| Dharinchuko ||
4)Dharinchuko Dhaivavaakyakhadgaanni
Vaadigala Sajeeva Aatmakhadgaanni
Edirinchumu Apavaadi Tantraanni
Jayinchumu Saataanu Sainyaanni
|| Dharinchuko ||
5)Suvaarta Ichchu Sidhamanasu Jodu Toduguko
Kreestu Prabhuni Adugujaada Choochi Naduchuko
Kreestuyesu Manasu Kaligiyunda Nerchuko
Tandri Kishtamainadella Cheyaboonuko
|| Dharinchuko ||