Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 50 Old No: 166

అన్ని కాలంబుల నున్న

Anni Kaalambula Nunna

♪ సీయోను గీతములు♪ Bethala John
Open in Word & Worship App
తెలుగు   అన్ని కాలంబుల నున్న
పల్లవి
అన్ని కాలంబుల - నున్న యెహోవాని - న్నెన్న దరంబయో
కన్న తండ్రి - వన్నె కెక్కిన మోక్ష - వాసాళి సన్నుతు
లున్నతమైయుండ - మున్నె నీకు
1)
నిన్నుఁబ్రకటనసేయ - నిఖిల లోకములను - బన్నుగజేసిన
బలుడ వీవె - ఉన్న లోకంబుల - నుడుగక కరుణాసం -
పన్నతతో నేలు - ప్రభుండ వీవె - అన్ని జీవుల నెఱిఁగి
యాహార మిచ్చుచు - నున్న సర్వజ్ఞం - డవు నీవే - ఎన్న శక్యము
గాక - ఉన్నలక్షణముల - సన్నుతించుటకు నే - జాలుదువా
|| అ ||
2)
పుట్టింప నీవంచఁబోషింప నీవంచు - గిట్టింప నీవంచుఁ
గీర్తింతును - వట్టి పనికిమాలినట్టి మానవులచే - పట్టి రక్షింపఁబా
ధ్యుండ వంచు - దట్టమైన కృపను - దరిజేర్చ నాకిచ్చి పట్టయి
నిలిచియుండు - ప్రభుండ వంచుఁ - గట్టడచేఁగడ - ముట్టుదనుక
నా పట్టుకొలది నిన్నుఁ - బ్రస్తుతింతు
|| అ ||
3)
కారుణ్యనిధి నీవు - ఖఠినాత్ముఁడను నేను - భూరి శుద్ధుఁడ వీవు
పాపి నేను - సార భాగ్యుడ వీవు - జగతిలో నాకన్న -
దారిద్రుఁడే లేఁడు - తరచి చూడ - సార సద్గుణముల -
సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను - ఏ రీతిస్తుతియింతు -
నే రీతి సేవింతు - నేర మెన్నక ప్రోవ - నెర నమ్మితి
|| అ ||
English   Anni Kaalambula Nunna
Chorus
Anni Kaalanbula - Nunna Yehovaani - Nnenna Daranbayo
Kanna Tandri - Vanne Kekkina Moksha - Vaasaali Sannutu
Lunnatamaiyunda - Munne Neeku
1)
Ninnunbrakatanaseya - Nikhila Lokamulanu - Bannugajesina
Baluda Veeve - Unna Lokanbula - Nudugaka Karunaasan -
Pannatato Nelu - Prabhunda Veeve - Anni Jeevula Neringi
Yaahaara Michchuchu - Nunna Sarvagnaan - Davu Neeve - Enna Sakyamu
Gaaka - Unnalakshanamula - Sannutinchutaku Ne - Jaaluduvaa
|| A ||
2)
Puttinpa Neevanchanboshinpa Neevanchu - Gittinpa NeevanchuM
Geertintunu - Vatti Panikimaalinatti Maanavulache - Patti Rakshinpanbaa
Dhyunda Vanchu - Dattamaina Krupanu - Darijercha Naakichchi Pattayi
Nilichiyundu - Prabhunda Vanchun - Gattadachengada - Muttudanuka
Naa Pattukoladi Ninnun - Brasthuthintu
|| A ||
3)
Kaarunyanidhi Neevu - Khathinaatmundanu Nenu - Bhoori Suddhunda Veevu
Paapi Nenu - Saara Bhaagyuda Veevu - Jagatilo Naakanna -
Daaridrunde Lendu - Tarachi Chooda - Saara Sadgunamula -
Sanpannundavu Neevu Ghora Durguna Sanchaari Nenu - e Reetisthuthiyintu -
Ne Reeti Sevintu - Nera Mennaka Prova - Nera Nammiti
|| A ||
Present