Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 5

అమూల్య రక్తము ద్వారా

Amoolya Raktamu Dvaaraa

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   అమూల్య రక్తము ద్వారా
పల్లవి
అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము
1)
మన యౌవ్వన జీవితముల్ - శరీరాశకు లోబరచి
చెడుమాటలను పలుకుచు - శాంతి లేక యుంటిమిగా
|| అ ||
2)
చెడు మార్గమున బోతిమి - దానియంతము మరణము
నరక శిక్కు లోబడుచు - పాపపు ధనమును బొందితిమి
|| అ ||
3)
నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక
స్వంత నీతితోడనే దేవుని రాజ్యము కోరితిమి
|| అ ||
4)
కనికరముగల దేవుడు మానవ రూపము దాల్చెను
ప్రాణము సిలువలో బలిచేసి - మనల విమోచించెను
|| అ ||
5)
తన రక్తధారలలో - మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి మనలనింపెను జ్ఞానముతో
|| అ ||
6)
పాపులమైన మన మీద - తన యాశ్చర్య ఘన ప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లించెదము
|| అ ||
7)
మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసిను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము - ఆత్మజీవ శరీరములన్
|| అ ||
English   Amoolya Raktamu Dvaaraa
Chorus
Amoolya Raktamu Dvaaraa - Rakshana Pondina Janulaaraa
Sarvasaktuni Prajalaaraa Parisuddhulaaraa Paadedamu
Ghanata Mahima Stutulanu - Parisuddhulaaraa Paadedamu
1)
Mana Yauvvana Jeevitamul - Sareeraasaku Lobarachi
Chedumaatalanu Palukuchu - Saanti Leka Yuntimigaa
|| A ||
2)
Chedu Maargamuna Botimi - Daaniyantamu Maranamu
Naraka Sikshaku Lobaduchu - Paapapu Dhanamunu Bonditimi
|| A ||
3)
Nitya Satya Devuni - Naamamuna Moralidaka
Svanta Neetitodane Devuni Raajyamu Koritimi
|| A ||
4)
Kanikaramugala Devudu Maanava Roopamu Daalchenu
Praanamu Siluvalo Balichesi - Manala Vimochinchenu
|| A ||
5)
Tana Raktadhaaralalo - Mana Paapamulanu Kadigi
Mana Kannulanu Terachi Manalaninpenu Gnaanamuto
|| A ||
6)
Paapulamaina Mana Meeda - Tana Yaascharya Ghana Prema
Kummarinchenu Mana Prabhuvu - Krutagnaata Chellinchedamu
|| A ||
7)
Mana Rakshakuni Sthuthinchedamu - Manalanu Jesenu Dhanyulugaa
Mana Devuni Karpinchedamu - Aatmajeeva Sareeramulan
|| A ||
Present