Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 495 Old No: 214

పరలోక రాజ్య నివాసి

Paraloka Raajya Nivaasi

Open in Word & Worship App
తెలుగు   పరలోక రాజ్య నివాసి
పల్లవి
పరలోక రాజ్యనివాసి - ప్రభుయేసుని ప్రియ విశ్వాసి
భువి యాత్రయందు - పరదేశి - ప్రభు పాదముల్ బట్టి ప్రేమించు
1)
తిరిగిచూడము ఐగుప్తుదేశం - తీవ్రముగ వెళ్ళెదం స్వదేశం
దూతలు జీవించు పరమదేశం - నిత్యుడగు తండ్రి ప్రజ్వలించు
దేశం - నీతిమంతులు నివసించు దేశం
|| పర ||
2)
వ్యక్తిగతముగ యాత్ర వెళ్ళెదం - గుంపు గుంపులుగా వెడలి
వెళ్ళెదం - కుటుంబ సమేతముగా వెళ్ళెదం - సర్వజనులు కలసి
వెళ్ళెదం - సైన్యాధిపతి యేసువెంబడి వెళ్ళెదం
|| పర ||
3)
చావు దుఃఖములు లేవక్కడ - సైతాను సైన్యము లేదక్కడ
కన్నీరు కష్టము లేదక్కడ - గాంఢాంధకారము లేదక్కడ
ఆకలి దప్పులు లేవక్కడ
|| పర ||
4)
నిరీక్షణ పొంది పాడెదను - నిజమైన సాక్ష్యంగలిగి వేడెదను
ఈ భువియాత్రను సాగెదను - అద్దరిజేరి జీవించెదను
ఆ శుభదినమందు చూచెదను
|| పర ||
English   Paraloka Raajya Nivaasi
Chorus
Paraloka Raajyanivaasi - Prabhuyesuni Priya Visvaasi
Bhuvi Yaatrayandu - Paradesi - Prabhu Paadamul Batti Preminchu
1)
Tirigichoodamu Aiguptudesan - Teevramuga Velledan Svadesam
Dootalu Jeevinchu Paramadesan - Nityudagu Tandri Prajvalinchu
Desan - Neetimantulu Nivasinchu Desan
|| Para ||
2)
Vyaktigatamuga Yaatra Velledan - Gunpu Gunpulugaa Vedali
Velledan - Kutunba Sametamugaa Velledan - Sarvajanulu Kalasi
Velledan - Sainyaadhipati Yesuvenbadi Velledan
|| Para ||
3)
Chaavu DuHkhamulu Levakkada - Saitaanu Sainyamu Ledakkada
Kanneeru Kashtamu Ledakkada - Gaandhaandhakaaramu Ledakkada
Aakali Dappulu Levakkada
|| Para ||
4)
Nireekshana Pondi Paadedanu - Nijamaina Saakshyangaligi Vededanu
Ee Bhuviyaatranu Saagedanu - Addarijeri Jeevinchedanu
Aa Subhadinamandu Choochedanu
|| Para ||
Present