తెలుగు దేవుని వారసులం
పల్లవిదేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవయుగ సైనికులం - పరలోక పౌరులము - హల్లెలూయ
1)దారుణ హింసలలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలో - ఆగని జయములతో
మారని ప్రేమ - సమర్పణతో - సర్వత్ర యేసుని - కీర్తింతుము
|| దేవుని ||
2)సజీవ సిలువ ప్రభూ - సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం - విధేయ బోధకులం
నిజముగ రక్షణ - ప్రబలుటకై
ధ్వజముగ సిలువను - నిలుపుదము
|| దేవుని ||
3)హతసాక్షుల కాలం - అవనిలో చెలరేగ
గతకాలపు సేవ - గొల్గొతగిరి జేర
భీతులలో - భహురీతులలో - నూతన లోకము - కాంక్షింతము
|| దేవుని ||
4)ప్రభువును చూచుటకై - ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ - విశ్వమే మము గోర
శుభములు గూర్చుచు - మాలోన
శోభిల్లు యేసును - జూపుదుము
|| దేవుని ||
English Devuni Vaarasulan
ChorusDevuni Vaarasulan - Prema Nivaasulamu
Jeevana Yaatrikulan - Yesuni Daasulamu
Navayuga Sainikulan - Paraloka Paurulamu - Hallelooya
1)Daaruna Hinsalalo - Devuni Dootalugaa
Aarani Jvaalalo - Aagani Jayamulato
Maarani Prema - Samarpanato - Sarvatra Yesuni - Keertintumu
|| Devuni ||
2)Sajeeva Siluva Prabhoo - Samaadhi Geluchutache
Vijeta Premikulan - Vidheya Bodhakulam
Nijamuga Rakshana - Prabalutakai
Dhvajamuga Siluvanu - Nilupudamu
|| Devuni ||
3)Hatasaakshula Kaalan - Avanilo Chelarega
Gatakaalapu Seva - Golgotagiri Jera
Bheetulalo - Bhahureetulalo - Nootana Lokamu - Kaankshintamu
|| Devuni ||
4)Prabhuvunu Choochutakai - Prajalandaru Raagaa
Vibhu Mahimanu Gaancha - Visvame Mamu Gora
Subhamulu Goorchuchu - Maalona
Sobhillu Yesunu - Joopudumu
|| Devuni ||