తెలుగు ప్రేమ శాశ్వత కాలముండును
పల్లవిప్రేమ శాశ్వత కాలముండును - ప్రేమ అన్నిటిలో శ్రేష్ఠము
ప్రేమ సిలువ విలువ జూపె - ప్రేమ యెట్టిదో ప్రభువు నేర్పె
ప్రేమ జూపు పరుల యెడల - ప్రేమ కలిగి యుండు ప్రియుడా
1)ప్రేమలో దీర్ఘశాంతము - ప్రేమలో దయాళుత్వము
ప్రేమ సహింప నేర్పును - ప్రేమ కలిగి యుండు ప్రియుడా
|| ప్రేమ ||
2)ప్రేమలో సత్యమున్నది - ప్రేమ సంతోషమిచ్చును
ప్రేమయే సమాధానము - ప్రేమ కలిగి యుండు ప్రియుడా
|| ప్రేమ ||
3)ప్రేమలో డంబముండదు - ప్రేమ ఉప్పొంగదెప్పుడు
ప్రేమలో తగ్గింపున్నది - ప్రేమ కలిగి యుండు ప్రియుడా
|| ప్రేమ ||
4)ప్రేమించు సహోదరుని - ప్రార్థించు శత్రువుకై
ప్రేమ యేసుని మనస్సు - ప్రేమ కలిగి యుండు ప్రియుడా
|| ప్రేమ ||
English Prema Shashvata Kaalamundunu
ChorusPrema Saasvata Kaalamundunu - Prema Annitilo Sreshthamu
Prema Siluva Viluva Joope - Prema Yettido Prabhuvu Nerpe
Prema Joopu Parula Yedala - Prema Kaligi Yundu Priyudaa
1)Premalo Deerghasaantamu - Premalo Dayaalutvamu
Prema Sahinpa Nerpunu - Prema Kaligi Yundu Priyudaa
|| Prema ||
2)Premalo Satyamunnadi - Prema Santoshamichchunu
Premaye Samaadhaanamu - Prema Kaligi Yundu Priyudaa
|| Prema ||
3)Premalo Danbamundadu - Prema Uppongadeppudu
Premalo Tagginpunnadi - Prema Kaligi Yundu Priyudaa
|| Prema ||
4)Preminchu Sahodaruni - Praarthinchu Satruvukai
Prema Yesuni Manassu - Prema Kaligi Yundu Priyudaa
|| Prema ||