తెలుగు ఎంత సుందరుడమ్మా
పల్లవిఎంత సుందరుడమ్మ శ్రీయేసు - ఎంత శ్రీమంతుడు ప్రభుయేసు
ఎంతయని వర్ణింతు ప్రభుప్రేమను - అంతు లేనే లేదు ప్రభు ప్రేమకు
1)సాటిలేనే లేదు ప్రభు ఎత్తులో - పోటి లేనే లేదు ప్రభు శక్తిలో
మాటతో జగములను కలిగించి వెలిగించి పాటుతో -
మానవుని సృష్టించినాడమ్మా
|| ఎంత ||
2)జ్ఞానమునకు మించె ప్రభు ప్రేమ
అష్టదిక్కులు దాటి ప్రభుప్రేమ - ఆకాశములు
భూమి అగాధ జలములు ఎన్నియున్నను ప్రభువు
ప్రేమయేమిన్నయౌ
|| ఎంత ||
3)అతిసుందరాంగుడు అతి వికారిగామారె
అతిపరిశుద్ధుడు శాపగ్రాహియాయె
సర్వశక్తుడు తాను రిక్తుడై పోయెగా
ఐశ్వర్యమును వీడి దారిద్రుడాయెగా
|| ఎంత ||
4)నరులను పరలోక వాసులను జేయనై
సింహాసనము వీడి సిలువపై నెక్కాడు
దురితాత్ములను బ్రోవ రక్తమంతయు గార్చి
మరణించి మరిలేచి పరలోకమున జేరె
|| ఎంత ||
5)పరలోక సౌఖ్యపు సౌధములు సమకూర్చి
త్వరలోనే ధరపైని వధువును గొనిపోవ
త్వరగా వస్తానంచు ప్రకటించుచున్నాడు
సిద్ధపడి రారండి ప్రభువు నారాధింప
|| ఎంత ||
English Enta Sundarudamma
ChorusEnta Sundarudamma Sreeyesu - Enta Sreemantudu Prabhuyesu
Entayani Varnintu Prabhupremanu - Antu Lene Ledu Prabhu Premaku
1)Saatilene Ledu Prabhu Ettulo - Poti Lene Ledu Prabhu Saktilo
Maatato Jagamulanu Kaliginchi Veliginchi Paatuto -
Maanavuni Srushtinchinaadammaa
|| Enta ||
2)Gnaanamunaku Minche Prabhu Prema
Ashtadikkulu Daati Prabhuprema - Aakaasamulu
Bhoomi Agaadha Jalamulu Enniyunnanu Prabhuvu
Premayeminnayau
|| Enta ||
3)Atisundaraangudu Ati Vikaarigaamaare
Atiparisuddhudu Saapagraahiyaaye
Sarvasaktudu Taanu Riktudai Poyegaa
Aisvaryamunu Veedi Daaridrudaayegaa
|| Enta ||
4)Narulanu Paraloka Vaasulanu Jeyanai
Sinhaasanamu Veedi Siluvapai Nekkaadu
Duritaatmulanu Brova Raktamantayu Gaarchi
Maraninchi Marilechi Paralokamuna Jere
|| Enta ||
5)Paraloka Saukhyapu Saudhamulu Samakoorchi
Tvaralone Dharapaini Vadhuvunu Gonipova
Tvaragaa Vastaananchu Prakatinchuchunnaadu
Sidhapadi Raarandi Prabhuvu Naaraadhinpa
|| Enta ||