Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 489 Old No: 870

నే నను కొనలేదు

Ne Nanu Konaledu

Open in Word & Worship App
తెలుగు   నే నను కొనలేదు
పల్లవి
నేనను కొనలేదు - నాకీ భాగ్యమున్నదని
నే కోరుకొనలేదు - నాకీ స్థితి కావాలని
ఇది దేవుని సంకల్పమే - అంతా ఆయన సంకల్పమే
1)
నేను చీకటినై యుండగా - నా క్రియలన్నీ చెడిపోవగా
వెలుగై నన్ను వెదకి వచ్చి - అరుదైన ఈ జీవితమిచ్చెను
|| నేనను ||
2)
నీతి హీనతే నా నైజమై నిత్య నాశనమందు పడియుండగా
నీతి సూర్యుడు ప్రభు యేసు నూతనాత్మతో నను నింపెను
|| నేనను ||
3)
నాలో ఏమి లేదుగా నాతో ఏమి కాదుగా
నన్ను ఎందుకో ఎన్ను కొనెన్‌ తన పనివానిగా నను జేసెను
|| నేనను ||
4)
నా దర్శనము నా ముందున్నది ఆ పిలుపే వినబడుచున్నది
ఇహమందు నా పని గొప్పది పరమందు బహుమానము ఉన్నది
|| నేనను ||
5)
నేనేగుదును పరలోకము నేనుందును పరిశుద్ధులతో
లేదిక నాకు మించిన ధన్యం ఇదే ఈ యాత్రికుని గమ్యము
|| నేనను ||
English   Ne Nanu Konaledu
Chorus
Nenanu Konaledu - Naakee Bhaagyamunnadani
Ne Korukonaledu - Naakee Sthiti Kaavaalani
Idi Devuni Sankalpame - Antaa Aayana Sankalpame
1)
Nenu Cheekatinai Yundagaa - Naa Kriyalannee Chedipovagaa
Velugai Nannu Vedaki Vachchi - Arudaina Ee Jeevitamichchenu
|| Nenanu ||
2)
Neeti Heenate Naa Naijamai Nitya Naasanamandu Padiyundagaa
Neeti Sooryudu Prabhu Yesu Nootanaatmato Nanu Ninpenu
|| Nenanu ||
3)
Naalo emi Ledugaa Naato emi Kaadugaa
Nannu Enduko Ennu Konen Tana Panivaanigaa Nanu Jesenu
|| Nenanu ||
4)
Naa Darsanamu Naa Mundunnadi Aa Pilupe Vinabaduchunnadi
Ihamandu Naa Pani Goppadi Paramandu Bahumaanamu Unnadi
|| Nenanu ||
5)
Nenegudunu Paralokamu Nenundunu Parisuddhulato
Ledika Naaku Minchina Dhanyan Ide Ee Yaatrikuni Gamyamu
|| Nenanu ||
Present