తెలుగు ఎంత మంచి దేవుడవయ్యా
పల్లవిఎంత మంచి దేవుడవయ్యా - యేసయ్యా
చింతలన్ని తీరెనయ్యా - నిన్ను చేర
నా చింతలన్ని తీరెనయ్యా - నిన్ను చేర
1)సంతోషము ఎచ్చట వుందని - సమాధానమెచ్చట నాకు దొరికేనని
జగమంతా వెదికాను - జనులందరినడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను (2సార్లు)
నా దేవుడవని నిన్నే నే నమ్ముకున్నాను
|| ఎంత ||
2)ప్రేమనేది ఎచ్చట వుందని - క్షమనేది ఎచ్చట నాకు దొరికేనని
బంధువులలో వెతికాను - స్నేహితులను అడిగాను
చివరికది నీలోనే కనుగొన్నాను (2సార్లు)
నా దేవుడవని నిన్నే నే నమ్ముకొన్నాను
|| ఎంత ||
3)సత్యమనేదెచ్చట వుందనీ - నిత్య జీవ మార్గమెచ్చట నాకు దొరికేనని
ఎందరినో మ్రొక్కాను - ఏవేవో చేశాను
చివరికది నీలోనే కనుగొన్నాను (2సార్లు)
నా దేవుడవని నిన్నే నే నమ్ముకొన్నాను
|| ఎంత ||
English Enta Manchi Devudavayya
ChorusEnta Manchi Devudavayyaa - Yesayyaa
Chintalanni Teerenayyaa - Ninnu Chera
Naa Chintalanni Teerenayyaa - Ninnu Chera
1)Santoshamu Echchata Vundani - Samaadhaanamechchata Naaku Dorikenani
Jagamantaa Vedikaanu - Janulandarinadigaanu
Chivarikadi Neelone Kanugonnaanu (2saarlu)
Naa Devudavani Ninne Ne Nammukunnaanu
|| Enta ||
2)Premanedi Echchata Vundani - Kshamanedi Echchata Naaku Dorikenani
Bandhuvulalo Vetikaanu - Snehitulanu Adigaanu
Chivarikadi Neelone Kanugonnaanu (2saarlu)
Naa Devudavani Ninne Ne Nammukonnaanu
|| Enta ||
3)Satyamanedechchata Vundanee - Nitya Jeeva Maargamechchata Naaku
Dorikenani
Endarino Mrokkaanu - evevo Chesaanu
Chivarikadi Neelone Kanugonnaanu (2saarlu)
Naa Devudavani Ninne Ne Nammukonnaanu
|| Enta ||