తెలుగు రేయి పగలు నీపద సేవే
పల్లవిరేయి పగలు నీ పదసేవే - జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడనీవే - నాదు కోట కొండయు నీవే
1)పరమ పురిలో వరదా నిరతం - దూతగణములు స్తుతులను
సలిపి శుద్ధుడు పరిశుద్ధుడనుచు - పూజనొందే దేవుడనీవే
|| రేయి ||
2)జిగట మన్నే మానవులంతా - పరమ కుమ్మరి ప్రభుడవు నీవే
సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా
|| రేయి ||
3)పెంటకుప్పల నుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే
గర్వమణచి గద్దెలు దింపి - ఘనులనైన మేపవగడ్డి
|| రేయి ||
4)నరులనమ్ముకంటె నిజముగ - నీదు శరణం శరణం దేవా
రాజులను ధర నమ్ముటకంటే - రాజారాజవు నాకాశ్రయము
|| రేయి ||
5)అగ్ని వాసన నంటకుండ - అబెద్నెగోలతో నుండిన దేవా
దానియేలును సింహపు బోనులో - ఆదుకొన్న నాథుడనీవే
|| రేయి ||
6)పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పధము నీవే
అడుగు జాడల నడిచిన హానోకు - పరముజేరే ప్రాణము తోడ
|| రేయి ||
7)మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును ఓడించితినీవు
|| రేయి ||
English Reyi Pagalu Neepada Seve
ChorusReyi Pagalu Nee Padaseve - Jeevadaayaka Cheyuta Melu
Saatileni Devudaneeve - Naadu Kota Kondayu Neeve
1)Parama Purilo Varadaa Niratan - Dootaganamulu Stutulanu
Salipi Suddhudu Parisuddhudanuchu - Poojanonde Devudaneeve
|| Reyi ||
2)Jigata Manne Maanavulantaa - Parama Kummari Prabhudavu Neeve
Srushtikartanu Marachi Janulu - Srushtine Poojinchuta Tagunaa
|| Reyi ||
3)Pentakuppala Nundi Deenula - Paikilepu Prabhudavu Neeve
Garvamanachi Gaddelu Dinpi - Ghanulanaina Mepavagaddi
|| Reyi ||
4)Narulanammukante Nijamuga - Needu Saranan Saranan Devaa
Raajulanu Dhara Nammutakante - Raajaaraajavu Naakaasrayamu
|| Reyi ||
5)Agni Vaasana Nantakunda - Abednegolato Nundina Devaa
Daaniyelunu Sinhapu Bonulo - Aadukonna Naathudaneeve
|| Reyi ||
6)Parama Gurudavu Prabhulaku Prabhudavu - Paramu Jerche Padhamu Neeve
Adugu Jaadala Nadichina Haanoku - Paramujere Praanamu Toda
|| Reyi ||
7)Mrtula Sahitamu Lepinaavu - Mrtini Gelchi Lechinaavu
Mrtulanella Lepevaadavu - Mrtyuvunu Odinchitineevu
|| Reyi ||