Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 470 Old No: 285

యేసుని కొరకై యిల జేవించెద

Yesuni Korakai Yila Jevinceda

Open in Word & Worship App
తెలుగు   యేసుని కొరకై యిల జేవించెద
పల్లవి
యేసుని కొరకై యిల జీవించెద - భాసురముగ నే ననుదినము
దోషములన్నియు బాపెను మోక్ష నివాసమున ప్రభు జేర్చునుగా
1)
నాశనకరమగు గుంటలో నుండియు - మోస కరంబగు యూబి నుండి
నాశచే నిలపై కెత్తెను నన్ను - పిశాచి పథంబున దొలగించెన్‌
|| యేసు ||
2)
పలువిధముల పాపంబులు జేసితి - వలదని ద్రోసితి వాక్యమును
కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో - నన్నాకర్షించెన్‌
|| యేసు ||
3)
అలయక సొలయక సాగిపోదును - వెలయగ నా ప్రభు మార్గములన్‌
కలిగెను నెమ్మది కలువరిగిరిలో-విలువగు రక్తము చిందించిన ప్రభు
|| యేసు ||
4)
శోధన బాధలు శ్రమలిల గల్గిన - ఆదుకొనును నా ప్రభువనిశం
వ్యాధులు లేములు మరణము వచ్చిన - నాధుడే నా నిరీక్షణగున్‌
|| యేసు ||
5)
బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు - గుప్తమైయున్నవి ప్రభునందు
అద్భుతముగ ప్రభు - వన్నియునొసగి - దిద్దును నా బ్రతుకంతటిని
|| యేసు ||
6)
అర్పించెను తన ప్రాణము నాకై - రక్షించెను నాప్రియ ప్రభువు
అర్పింతును నా యావజ్జీవము - రక్షకుడేసుని సేవింప
|| యేసు ||
7)
ప్రభునందానందింతును నిరతము - ప్రార్థన విజ్ఞాపనములతో
విభుడే దీర్చును యిల నాచింతలు - అభయముతో స్తుతియింతు
ప్రభున్‌
|| యేసు ||
8)
యౌవన జనమా - యిదియే సమయము - యేసుని చాటను
రారండి - పావన నామము - పరిశుద్ధనామము - జీవపు మార్గము
ప్రచురింపన్‌
|| యేసు ||
English   Yesuni Korakai Yila Jevinceda
Chorus
Yesuni Korakai Yila Jeevincheda - Bhaasuramuga Ne Nanudinamu
Doshamulanniyu Baapenu Moksha Nivaasamuna Prabhu Jerchunugaa
1)
Naasanakaramagu Guntalo Nundiyu - Mosa Karanbagu Yoobi Nundi
Naasache Nilapai Kettenu Nannu - Pisaachi Pathanbuna Dolaginchen
|| Yesu ||
2)
Paluvidhamula Paapanbulu Jesiti - Valadani Drositi Vaakyamunu
Kalushamu Baapenu Karunanu Bilichenu Siluvalo - Nannaakarshinchen
|| Yesu ||
3)
Alayaka Solayaka Saagipodunu - Velayaga Naa Prabhu Maargamulan
Kaligenu Nemmadi Kaluvarigirilo-Viluvagu Raktamu Chindinchina Prabhu
|| Yesu ||
4)
Sodhana Baadhalu Sramalila Galgina - Aadukonunu Naa Prabhuvanisam
Vyaadhulu Lemulu Maranamu Vachchina - Naadhude Naa Nireekshanagun
|| Yesu ||
5)
Buddhi Vignaana Sarvasanpadalu - Guptamaiyunnavi Prabhunandu
Adbhutamuga Prabhu - Vanniyunosagi - Diddunu Naa Bratukantatini
|| Yesu ||
6)
Arpinchenu Tana Praanamu Naakai - Rakshinchenu Naapriya Prabhuvu
Arpintunu Naa Yaavajjeevamu - Rakshakudesuni Sevinpa
|| Yesu ||
7)
Prabhunandaanandintunu Niratamu - Praarthana Vignaapanamulato
Vibhude Deerchunu Yila Naachintalu - Abhayamuto Sthuthiyintu
Prabhun
|| Yesu ||
8)
Yauvana Janamaa - Yidiye Samayamu - Yesuni Chaatanu
Raarandi - Paavana Naamamu - Parisudhanaamamu - Jeevapu Maargamu
Prachurinpan
|| Yesu ||
Present