తెలుగు నిజమైన ద్రాక్షావల్లి
పల్లవినిజమైన ద్రాక్షావల్లి నా యేసు - ఉత్తమ ద్రాక్షావల్లి
నిను నమ్మిన పిల్లలం మేము - నిలచి ఎదిగెడి తీగెలం
1)సత్తువగల భూమిలో - వల్లిని చక్కగ పోషించెను (2)
శ్రేష్ఠఫలముల నాశించె నా ప్రభువు - భ్రష్టమైనవి ఫలియించె
|| ని ||
2)ఫలియించు లతలన్నిటిన్ - యేసుండు పరిఢవిల్లగ జేయును
ఫలియింపని ప్రతి తీగెను - యేసుండు పారవేయును అగ్నిలో
|| ని ||
3)పరిశుద్ధాత్ముని సాయమున్ - ఆశించి ఫలియించుమో సోదరా
వ్యర్థుడవుగా నున్నచో - యేసుండు వ్యసన క్రాంతుడౌనుగా
|| ని ||
4)కారుద్రాక్షలు కాచిన కారణము - కనిపెట్టును ప్రభువు
క్షమియించుమని వేడిన - ఓ ప్రియుడా క్షమియించి కరుణించును
|| ని ||
5)పశ్చాత్తాపము నొందిన - ఓ ప్రియుడా పారద్రోలును చీకటిన్
వెలుగునిమ్మని వేడినా - ఆ ప్రభువు వెలిగించి నడిపించును
|| ని ||
English Nijamaina Draakshaavalli
ChorusNijamaina Draakshaavalli Naa Yesu - Uttama Draakshaavalli
Ninu Nammina Pillalan Memu - Nilachi Edigedi Teegelam
1)Sattuvagala Bhoomilo - Vallini Chakkaga Poshinchenu (2)
Sreshthaphalamula Naasinche Naa Prabhuvu - Bhrashtamainavi Phaliyinche
|| Ni ||
2)Phaliyinchu Latalannitin - Yesundu Paridhavillaga Jeyunu
Phaliyinpani Prati Teegenu - Yesundu Paaraveyunu Agnilo
|| Ni ||
3)Parisudhaatmuni Saayamun - Aasinchi Phaliyinchumo Sodaraa
Vyarthudavugaa Nunnacho - Yesundu Vyasana Kraantudaunugaa
|| Ni ||
4)Kaarudraakshalu Kaachina Kaaranamu - Kanipettunu Prabhuvu
Kshamiyinchumani Vedina - O Priyudaa Kshamiyinchi Karuninchunu
|| Ni ||
5)Paschaattaapamu Nondina - O Priyudaa Paaradrolunu Cheekatin
Velugunimmani Vedinaa - Aa Prabhuvu Veliginchi Nadipinchunu
|| Ni ||