Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 467 Old No: 222

ప్రభు నీవాడను

Prabhu Neevaadanu

Open in Word & Worship App
తెలుగు   ప్రభు నీవాడను
పల్లవి
ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును
మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను (2)
1)
ప్రభువా యెరిగితిని లోకమంత మోసమని
చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో
కృతజ్ఞత కలిగి, కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను
నీ యందే నిలిచియుండి నీ ఆజ్ఞల పాటింతును
|| ప్రభు ||
2)
నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను
నీవు నాతోడ నుండ మరచెదను దుఃఖమును
నెమ్మదిని పొంది యిల, నెమ్మదిని పొంది యిల కన్నీరు కార్చనిక
నీవే నా సర్వమని నీయందే బలపడెదను
|| ప్రభు ||
3)
యేసుని సిలువ జూచి విజయమును పొందెదను
సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని
నిన్ను నే నమ్మెదను, నిన్ను నే నమ్మెదను నీతోనే సాగెదను
నీ రెక్కలచాటు నేనుండ భయపడను
|| ప్రభు ||
4)
మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను
మృత్యువుబారినుండి జీవమునకు దాటింతువు
రక్షకుని చూచెదను, రక్షకుని చూచెదను నన్నాయన
చేర్చుకొనున్‌ - తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదము
|| ప్రభు ||
5)
ఆగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి
దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను
నే సంతసించెదను నే సంతసించెదను ప్రభువు తోడ నుండెదను
నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును
|| ప్రభు ||
English   Prabhu Neevaadanu
Chorus
Prabhu Nee Vaadanu Neevu Naa Prabhudavani Nee Korakai Jeevintunu
Migilina Jeevitamunu Nee Korake Gadipedanu (2)
1)
Prabhuvaa Yerigitini Lokamanta Mosamani
Choopitivi Samaadhaana Nireekshana Naakilalo
Krutagnaata Kaligi, Krutagnaata Kaligi Nee Vaipe Choochedanu
Nee Yande Nilichiyundi Nee Aagnaala Paatintunu
|| Prabhu ||
2)
Naa Mundu Nadiche Prabhoo Ninnu Venbadinchedanu
Neevu Naatoda Nunda Marachedanu DuHkhamunu
Nemmadini Pondi Yila, Nemmadini Pondi Yila Kanneeru Kaarchanika
Neeve Naa Sarvamani Neeyande Balapadedanu
|| Prabhu ||
3)
Yesuni Siluva Joochi Vijayamunu Pondedanu
Sahintunu Santasamuga Nee Koraku Annintini
Ninnu Ne Nammedanu, Ninnu Ne Nammedanu Neetone Saagedanu
Nee Rekkalachaatu Nenunda Bhayapadanu
|| Prabhu ||
4)
Marananadi Yoddaku Santasamuga Vachchedanu
Mrtyuvubaarinundi Jeevamunaku Daatintuvu
Rakshakuni Choochedanu, Rakshakuni Choochedanu Nannaayana
Cherchukonun - Takshaname Tana Roopamunaku Maarpu Chendedamu
|| Prabhu ||
5)
Aagamya Jyotiyandu Ghanamuga Ne Pravesinchi
Dootalu, Parisuddhulu, Bhaktulane Choochedanu
Ne Santasinchedanu Ne Santasinchedanu Prabhuvu Toda Nundedanu
Nireekshana Yidiye Aayanato Nenundunu
|| Prabhu ||
Present