తెలుగు ప్రభు యేసే నా బలము
పల్లవిప్రభుయేసే నా బలము - నా శైలము నా కోట - నను రక్షించినవాడు
1)నా శత్రువు చేతిలో నుండి నన్ రక్షించెను ఆ ప్రభువే
భక్తిహీనులు వరదవలె - ప్రబలి బెదిరింపగను
|| ప్రభు ||
2)పాతాళపు పాశములన్నిటిన్ - జయించెను మా ప్రభువే
ఆవరింపగ మరణపుటురులు - అతి ప్రేమతో ఆదుకొనెన్
|| ప్రభు ||
3)నా దీపము వెలిగించెను - వెలుగైన నా ప్రభువే
చీకటిని వెలుగుగ జేసె - నే దేనికి భయపడను
|| ప్రభు ||
4)నా కాళ్ళను జింకకాళ్ళవలె - జేసెను నా ప్రభువే
ఎత్తైన స్థలములమిద - నడిపించుచున్నాడు
|| ప్రభు ||
5)నా రక్షణకర్తను పాడెద - సేవింతును హృదయముతో
సతతంబును కొనియాడి - స్తోత్రింతును ఆమేన్
|| ప్రభు ||
English Prabhu Yese Naa Balamu
ChorusPrabhuyese Naa Balamu - Naa Sailamu Naa Kota - Nanu Rakshinchinavaadu
1)Naa Satruvu Chetilo Nundi Nan Rakshinchenu Aa Prabhuve
Bhaktiheenulu Varadavale - Prabali Bedirinpaganu
|| Prabhu ||
2)Paataalapu Paasamulannitin - Jayinchenu Maa Prabhuve
Aavarinpaga Maranaputurulu - Ati Premato Aadukonen
|| Prabhu ||
3)Naa Deepamu Veliginchenu - Velugaina Naa Prabhuve
Cheekatini Veluguga Jese - Ne Deniki Bhayapadanu
|| Prabhu ||
4)Naa Kaallanu Jinkakaallavale - Jesenu Naa Prabhuve
Ettaina Sthalamulamida - Nadipinchuchunnaadu
|| Prabhu ||
5)Naa Rakshanakartanu Paadeda - Sevintunu Hrudayamuto
Satatanbunu Koniyaadi - Stotrintunu Aamen
|| Prabhu ||