తెలుగు యెహోవాను గానము చేసెదము
పల్లవియెహోవాను గానము చేసెదము ఏకముగా - మనకు
రక్షకుడాయానే ఆయన మహిమ పాడెదము - ఆయనను
వర్ణించెదము - ఆయనే దేవుడు మనకు
1)శూరుడెహోవా - నా బలము నా గానము
నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా
|| యోహో ||
2)ఫరో రధముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను
ఎర్ర సముద్రములోన ముంచివేసెను యోహోవా
|| యోహో ||
3)నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు నీపై లేచువారికి
|| యోహో ||
4)దోపుడుసొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను అని శత్రువను కొనెను
|| యోహో ||
5)వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహనీయుడా
అద్భుతమమైన పూజ్యుడా నీవంటివాడెవడు
|| యోహో ||
6)ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యన - ఆరిన నేలను నడిచిరి
|| యోహో ||
English Yehovanu Gaanamu Chesedamu
ChorusYehovaanu Gaanamu Chesedamu ekamugaa - Manaku
Rakshakudaayaane Aayana Mahima Paadedamu - Aayananu
Varninchedamu - Aayane Devudu Manaku
1)Soorudehovaa - Naa Balamu Naa Gaanamu
Naa Pitarula Devudu Aayana Peru Yehovaa
|| Yoho ||
2)Pharo Radhamula Senalanu - Tana Sreshthaadhipatulanu
Erra Samudramulona Munchivesenu Yohovaa
|| Yoho ||
3)Nee Mahimaatisayamuna - Kopaagni Ragulajesi
Chettavale Dahinchedavu Neepai Lechuvaariki
|| Yoho ||
4)Dopudusommu Panchukoni - Aasa Teerchukondunu
Naa Katti Doosedanu Ani Satruvanu Konenu
|| Yoho ||
5)Velpulalo Nee Samudevadu - Parisudha Mahaneeyudaa
Adbhutamamaina Poojyudaa Neevantivaadevadu
|| Yoho ||
6)Israayeleeyulantaa - Ento Surakshitamugaa
Samudramu Madhyana - Aarina Nelanu Nadichiri
|| Yoho ||