Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 462 Old No: 387

జయ గీతము పాడుము

Jaya Geetamu Paadumu

Open in Word & Worship App
తెలుగు   జయ గీతము పాడుము
పల్లవి
జయగీతము పాడుము - జయశీలుని కొనియాడుము
జయధ్వానము చేయుము - జయమిచ్చెడి యేసయ్యకు
1)
వధింపబడిన గొఱ్ఱెపిల్ల - విమోచించెను నిన్ను నన్ను
జనులను దేవునికి కొనెను - రాజులు యాజకులుగ జేసెను
|| జయ ||
2)
పాత బ్రతుకును పాతిపెట్టి - క్రొత్తజీవము కలిగించె
కృతజ్ఞత స్తుతులతోడ - క్రొత్త గీతము పాడుము
|| జయ ||
3)
తుఫానువంటి శ్రమలెన్నో - భయభీతులను కలిగింప
అభయమిచ్చి కాపాడిన - నాధుని కొనియాడుము
|| జయ ||
4)
అదృశ్య దేవుని స్వరూపియే - సర్వసృష్టికి ఆధారము
దృశ్యములు అదృశ్యములు - ఆశ్చర్యకరుడేసు సృష్టములే
|| జయ ||
5)
జ్ఞానబలము కలవాడు - ఘనత మహిమకు పాత్రుండు
స్తోత్రము పొందనర్హుడు - సంతసముగ స్తుతియించుడి
|| జయ ||
English   Jaya Geetamu Paadumu
Chorus
Jayageetamu Paadumu - Jayaseeluni Koniyaadumu
Jayadhvaanamu Cheyumu - Jayamichchedi Yesayyaku
1)
Vadhinpabadina Gorrepilla - Vimochinchenu Ninnu Nannu
Janulanu Devuniki Konenu - Raajulu Yaajakuluga Jesenu
|| Jaya ||
2)
Paata Bratukunu Paatipetti - Krottajeevamu Kaliginche
Krutagnaata Stutulatoda - Krotta Geetamu Paadumu
|| Jaya ||
3)
Tuphaanuvanti Sramalenno - Bhayabheetulanu Kaliginpa
Abhayamichchi Kaapaadina - Naadhuni Koniyaadumu
|| Jaya ||
4)
Adrusya Devuni Svaroopiye - Sarvasrushtiki Aadhaaramu
Drusyamulu Adrusyamulu - Aascharyakarudesu Srushtamule
|| Jaya ||
5)
Gnaanabalamu Kalavaadu - Ghanata Mahimaku Paatrundu
Stotramu Pondanarhudu - Santasamuga Sthuthiyinchudi
|| Jaya ||
Present