తెలుగు స్తోత్రింతుము నిను మాడు
పల్లవిస్తోత్రింతుము నిను మాదు తండ్రి - సత్యముతో ఆత్మతో నెపుడు
పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం
1)శ్రేష్ఠయీూవుల యూటనీవే - శ్రేష్ఠకుమారుని యిచ్చినందున
త్రిత్వమై యేకత్వమైన త్రిలోక నాథా - శరణం శరణం
|| స్తో ||
2)పాపిమిత్రుడ పాపనాశక - పరమ వాసా ప్రేమాపూర్ణా - వ్యోమ
పీఠుడ స్వర్ణమయుడా -పరిశుద్ధాంగుడ - శరణం శరణం
|| స్తో ||
3)ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండ - నాథ నీవే - శరణం శరణం
|| స్తో ||
4)సంఘమునకు శిరస్సునీవే - రాజానీకే నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది - శరణం శరణం
|| స్తో ||
5)నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడుకొందుము - శరణం శరణం
|| స్తో ||
6)రాజా నీకే స్తుతిస్తోత్రములు - గీతములు మంగళ ధ్వనులు శుభము
శుభము శుభము నిత్యము హల్లెలూయ ఆమేన్ ఆమేన్
|| స్తో ||
English Stotrimtumu Ninu Maadu
ChorusStotrintumu Ninu Maadu Tandri - Satyamuto Aatmato Nepudu
Parisudhaalankaaramulato Darsinchedamu Saranan Saranam
1)Sreshthayeeoovula Yootaneeve - Sreshthakumaaruni Yichchinanduna
Tritvamai Yekatvamaina Triloka Naathaa - Saranan Saranan
|| Sto ||
2)Paapimitruda Paapanaasaka - Parama Vaasaa Premaapoornaa - Vyoma
Peethuda Svarnamayudaa -Parisudhaanguda - Saranan Saranan
|| Sto ||
3)Dhavalavarnuda Ratnavarnuda - Satyaroopi Yanabaduvaadaa
Nanu Rakshinchina Rakshakunda - Naatha Neeve - Saranan Saranan
|| Sto ||
4)Sanghamunaku Sirassuneeve - Raajaaneeke Namaskaaramulu
Mukhyamaina Moolaraayi - Kotlakoladi - Saranan Saranan
|| Sto ||
5)Needu Sevakula Punaadi - Gnaanamunaku Minchina Telivi
Andamuganu Koodukonuchu - Vedukondumu - Saranan Saranan
|| Sto ||
6)Raajaa Neeke Sthuthistotramulu - Geetamulu Mangala Dhvanulu Subhamu
Subhamu Subhamu Nityamu Hallelooya Aamen Aamen
|| Sto ||