Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 458 Old No: 366

పరమ రాజ్యమునకు నరులు

Parama Raajyamunaku Narulu

Open in Word & Worship App
తెలుగు   పరమ రాజ్యమునకు నరులు
పల్లవి
పరమ రాజ్యమునకు నరుల - తిరిగి పుట్ట వలయు ననుచు
బరమ గురువు యేసు క్రీస్తు - స్థిరము చేసెను
1)
వేదశాస్త్ర మెఱిఁగినట్టి - యూదులు యధికారియౌ ని
కోదే మనెడు పరిసయుండు - మదిని దలఁచుచున్‌
|| పరమ ||
2)
అతఁడు రాత్రివేళఁ ప్రభుని - చెంతకు పోయి యెదుట స -
మృతిని నిలిచి పిలిచి పల్కె - హితవుతోడను
|| పరమ ||
3)
బోధకుండ నీవు మోక్ష - నాథుఁడౌ యోహోవా యొక్క
వేదవార్తఁ జెప్పెదవు నీ - బోధ నెఱుంగుదున్‌
|| పరమ ||
4)
మరియు నీవు చేయుచున్న - గురుతు లెవ్వరైన దైవ
వరము లేని యట్టి పాప - నరులు చేయరు
|| పరమ ||
5)
అనుచుఁ బరిసయుండు పల్క - వినుచు యేసు కనికరమునఁ
దనకు నిట్లుఁ దెలిపెఁజాలి - మనసుతోడను
|| పరమ ||
6)
క్రొత్త జన్మ మెవ్వఁడైన - నెత్తకున్న మోక్షమునకు
నెత్తఁబడఁ డటంచు నిజము - క్రీస్తు పల్కెను
|| పరమ ||
7)
వినుచుఁ బరిసయుండు ముసలి - జనుఁడు మరల తల్లి గర్భ
మునను తిరుగునెట్లు బుట్టు - ననుచుఁబల్కెను
|| పరమ ||
8)
అందు కేసు తెల్పె జలము - నందుఁ నాత్మయందు జన్మ
మొందుకున్న మోక్ష రాజ్య - మొంద రనుచును
|| పరమ ||
English   Parama Raajyamunaku Narulu
Chorus
Parama Raajyamunaku Narula - Tirigi Putta Valayu Nanuchu
Barama Guruvu Yesu Kreestu - Sthiramu Chesenu
1)
Vedasaastra Meringinatti - Yoodulu Yadhikaariyau Ni
Kode Manedu Parisayundu - Madini Dalanchuchun
|| Parama ||
2)
Atandu Raatrivelan Prabhuni - Chentaku Poyi Yeduta Sa -
Mrtini Nilichi Pilichi Palke - Hitavutodanu
|| Parama ||
3)
Bodhakunda Neevu Moksha - Naathundau Yohovaa Yokka
Vedavaartan Jeppedavu Nee - Bodha Nerungudun
|| Parama ||
4)
Mariyu Neevu Cheyuchunna - Gurutu Levvaraina Daiva
Varamu Leni Yatti Paapa - Narulu Cheyaru
|| Parama ||
5)
Anuchun Barisayundu Palka - Vinuchu Yesu KanikaramunaM
Danaku Nitlun Delipenjaali - Manasutodanu
|| Parama ||
6)
Krotta Janma Mevvandaina - Nettakunna Mokshamunaku
Nettanbadan Datanchu Nijamu - Kreestu Palkenu
|| Parama ||
7)
Vinuchun Barisayundu Musali - Janundu Marala Talli Garbha
Munanu Tirugunetlu Buttu - Nanuchunbalkenu
|| Parama ||
8)
Andu Kesu Telpe Jalamu - Nandun Naatmayandu Janma
Mondukunna Moksha Raajya - Monda Ranuchunu
|| Parama ||
Present