Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 456

నా ప్రార్థన అంగీకరించుము

Naa Praarthana Angeekaarinchumu

Open in Word & Worship App
తెలుగు   నా ప్రార్థన అంగీకరించుము
పల్లవి
నా ప్రార్థన నంగీకరించుము - నా రాజా నాదేవా
నిన్నే ప్రార్థించుచున్నాను
1)
నా ఆర్తధ్వని ఆలకించుము - నా ధ్యానం మీద లక్ష్యముంచుము
నా కంఠమెత్తి చేయు విన్నపము - నే చేయురోదన వినుము
|| నా ||
2)
కరముల నెత్తి ప్రార్థింప నేర్పుము - కన్నీటితో ప్రార్థింప నేర్పుము
కష్టసమయాన మోకాళ్ళువంచి నే చేయు ప్రార్థన వినుము
|| నా ||
3)
ప్రతి సమయాన ప్రార్థింప నేర్పుము - పాపుల కొరకు ప్రార్థింప నేర్పుము
పరలోకము వచ్చునట్లుగా నే చేయు విన్నపము వినుము
|| నా ||
4)
మానక ప్రార్థించ నేర్పుము - మరువక ప్రార్థించ నేర్పుము
మెళకువ కలిగిన మనసును వంచి - నేను మొఱ్ఱపెట్టుట వినుము
|| నా ||
5)
మా సంఘక్షేమముకై ప్రార్థించనేర్పుము-మా మధ్య చెలరేగు సాతాను నణచుము
మా సమాధానం మీరే ప్రభువా - మా యొక్క విజ్ఞాపన వినుము.
|| నా ||
English   Naa Praarthana Angeekaarinchumu
Chorus
Naa Praarthana Nangeekarinchumu - Naa Raajaa Naadevaa
Ninne Praarthinchuchunnaanu
1)
Naa Aartadhvani Aalakinchumu - Naa Dhyaanan Meeda Lakshyamunchumu
Naa Kanthametti Cheyu Vinnapamu - Ne Cheyurodana Vinumu
|| Naa ||
2)
Karamula Netti Praarthinpa Nerpumu - Kanneetito Praarthinpa Nerpumu
Kashtasamayaana Mokaalluvanchi Ne Cheyu Praarthana Vinumu
|| Naa ||
3)
Prati Samayaana Praarthinpa Nerpumu - Paapula Koraku Praarthinpa Nerpumu
Paralokamu Vachchunatlugaa Ne Cheyu Vinnapamu Vinumu
|| Naa ||
4)
Maanaka Praarthincha Nerpumu - Maruvaka Praarthincha Nerpumu
Melakuva Kaligina Manasunu Vanchi - Nenu Morrapettuta Vinumu
|| Naa ||
5)
Maa Sanghakshemamukai Praarthinchanerpumu-Maa Madhya Chelaregu Saataanu
Nanachumu
Maa Samaadhaanan Meere Prabhuvaa - Maa Yokka Vignaapana Vinumu.
|| Naa ||
Present