Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 454

దేవుని తనయుడా దీవెన

Devuni Tanayudaa Deevena

Open in Word & Worship App
తెలుగు   దేవుని తనయుడా దీవెన
పల్లవి
దేవుని తనయుడా దీవెన లిడుమా
వదలను వరదుడ వరముల నిడనిదె
1)
సర్వ సృష్టికి మూలమునీవే శ్రేష్ఠ ఈవులకు ఊటవునీవే
ఆత్మనొసగిన అథికుడవీవే ఆత్మవరములకు కర్తవునీవే
|| దేవు ||
2)
ఎండెను పొలములు వర్షలేమిచే బీటలు వారెను భూతలమంత
వాక్యజల్లులు-తొలకరివానలు కడవరివానలు కలుగజేయుమా
|| దేవు ||
3)
ప్రార్థించె నేలియా పట్టుదలతోనాడు అర్ధించె నతిప్రియుడు
ఆదానియేలు ప్రార్థింతుమో యేసు ప్రజలందరికొఱకు
అర్థింతుమోదేవా అధికారుల కొరకు
|| దేవు ||
4)
కలువరి విలువను కనుపరచుటకు కలుషము నాపినకర్తవు నీవే
ఫలియింపని తీగెపార వేతువే ఆత్మఫలముల నధికము చేయుమా
|| దేవు ||
5)
నింపుము నీదు సత్యవాక్కులతో పెంపుము నీదు ఆత్మబలముతో
పంపుము నీదు ఆత్మధైర్యముతో ఇంపగు సువార్త వివరింపనిలలో
|| దేవు ||
English   Devuni Tanayudaa Deevena
Chorus
Devuni Tanayudaa Deevena Lidumaa
Vadalanu Varaduda Varamula Nidanide
1)
Sarva Srushtiki Moolamuneeve Sreshtha Eevulaku Ootavuneeve
Aatmanosagina Athikudaveeve Aatmavaramulaku Kartavuneeve
|| Devu ||
2)
Endenu Polamulu Varshalemiche Beetalu Vaarenu Bhootalamanta
Vaakyajallulu-Tolakarivaanalu Kadavarivaanalu Kalugajeyumaa
|| Devu ||
3)
Praarthinche Neliyaa Pattudalatonaadu Ardhinche Natipriyudu
Aadaaniyelu Praarthintumo Yesu Prajalandarikoraku
Arthintumodevaa Adhikaarula Koraku
|| Devu ||
4)
Kaluvari Viluvanu Kanuparachutaku Kalushamu Naapinakartavu Neeve
Phaliyinpani Teegepaara Vetuve Aatmaphalamula Nadhikamu Cheyumaa
|| Devu ||
5)
Ninpumu Needu Satyavaakkulato Penpumu Needu Aatmabalamuto
Panpumu Needu Aatmadhairyamuto Inpagu Suvaarta Vivarinpanilalo
|| Devu ||
Present