Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 445 Old No: 467

ప్రభు యేసు పునాది

Prabhu Yesu Punaadi

Open in Word & Worship App
తెలుగు   ప్రభు యేసు పునాది
పల్లవి
ప్రభుయేసు పునాది నాది - స్థిరమైన పునాది నాది
బలమైన బండ పునాది - బహుమంచి పునాది నాది
ఆపదలు తుఫానులెన్నో అవి బలముగా వీచినను
వడగాలులు వరదలు నాపై వడివడిగా కొట్టినను
ఏ అపాయము రాదు - ఏ కష్టము నష్టము రాదు
1)
బహు ప్రార్థన పునాది నాది - ఫలించెడి కొమ్మను నేను -
దేదీప్య దీపం వాక్యం - నాత్రోవకు వెలుగాయెను - బహు
శోధన బాధలలో బహువ్యాధి బాధలలో - బహు
కరువు కాటకముల్‌ నన్నేమి చేయవులే
|| ప్రభు ||
2)
ప్రభుయేసు పునాది నాది - పాపాత్ముల రక్షింపన్‌
ప్రభుయేసు పునాది - శత్రువులను ప్రేమింతున్‌
అపనిందలు వేసి నను - బహు బాధలు పెట్టినను
అన్నిటిని ఓర్చెదను - అన్యాయమును సహింతును
|| ప్రభు ||
3)
నా సొంత జనములు నన్ను - హింసించి బాధించినను
నా సొంత పశువులు పొలములు పాడి పంటలు
ఇవ్వకున్నను, నా శరీరమెల్లప్పుడు రోగాలకు గురియైనను
ప్రభుయేసు కృపలనుదలచి - స్తోత్రము చెల్లించెదను
|| ప్రభు ||
4)
నశియించెడు ఆత్మలను రక్షింప ప్రార్థింతును
సువార్తను ప్రకటింపన్‌ అనుదినము వెళ్లెదను
నా బ్రతుకులో ప్రభు ప్రేమన్‌ ప్రకటించి చాటెదను
ప్రభు రక్త ప్రభావము నాకు బహు విజయము కూర్చునయా
|| ప్రభు ||
English   Prabhu Yesu Punaadi
Chorus
Prabhuyesu Punaadi Naadi - Sthiramaina Punaadi Naadi
Balamaina Banda Punaadi - Bahumanchi Punaadi Naadi
Aapadalu Tuphaanulenno Avi Balamugaa Veechinanu
Vadagaalulu Varadalu Naapai Vadivadigaa Kottinanu
e Apaayamu Raadu - e Kashtamu Nashtamu Raadu
1)
Bahu Praarthana Punaadi Naadi - Phalinchedi Kommanu Nenu -
Dedeepya Deepan Vaakyan - Naatrovaku Velugaayenu - Bahu
Sodhana Baadhalalo Bahuvyaadhi Baadhalalo - Bahu
Karuvu Kaatakamul Nannemi Cheyavule
|| Prabhu ||
2)
Prabhuyesu Punaadi Naadi - Paapaatmula Rakshinpan
Prabhuyesu Punaadi - Satruvulanu Premintun
Apanindalu Vesi Nanu - Bahu Baadhalu Pettinanu
Annitini Orchedanu - Anyaayamunu Sahintunu
|| Prabhu ||
3)
Naa Sonta Janamulu Nannu - Hinsinchi Baadhinchinanu
Naa Sonta Pasuvulu Polamulu Paadi Pantalu
Ivvakunnanu, Naa Sareeramellappudu Rogaalaku Guriyainanu
Prabhuyesu Krupalanudalachi - Stotramu Chellinchedanu
|| Prabhu ||
4)
Nasiyinchedu Aatmalanu Rakshinpa Praarthintunu
Suvaartanu Prakatinpan Anudinamu Velledanu
Naa Bratukulo Prabhu Preman Prakatinchi Chaatedanu
Prabhu Rakta Prabhaavamu Naaku Bahu Vijayamu Koorchunayaa
|| Prabhu ||
Present