Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 444 Old No: 450

ప్రార్థన మించిన భాగ్యము

Praarthana Minchina Bhaagyamu

Open in Word & Worship App
తెలుగు   ప్రార్థన మించిన భాగ్యము
పల్లవి
ప్రార్థన మించిన భాగ్యములేదు ప్రార్థింతము రండి (2)
మన ప్రభుయేసు జీవితమంతా ప్రార్థనలో గడిపెన్‌ (2)
1)
మన ప్రభుయేసు జీవితము - బహువేదన రోదనతో (2)
పాపులరక్షణ కోరుకొనెన్‌ - తన ప్రాణము బలిచేసెన్‌ (2)
|| ప్రార్థన ||
2)
సుఖజీవనము పొందుటకు - మరి నెమ్మదిగా బ్రతుకన్‌ (2)
రాజుల కొరకై ప్రజలందరికై ప్రార్థన చేయుదము (2)
|| ప్రార్థన ||
3)
ఆత్మల రక్షణకై విలపించి - ప్రార్థన చేయుదము (2)
ఆత్మల భద్రతకై మనమిక - విజ్ఞాపన చేయుదము (2)
|| ప్రార్థన ||
4)
ఇరువది నలుగురు పెద్దలయొద్ద - సువర్ణ పాత్రలలో (2)
భక్తులు చేసిన ప్రార్థనలుండును - ప్రార్థించను రండి (2)
|| ప్రార్థన ||
5)
కన్నీటితో వాక్యముతో విత్తిన - సంతోషముతో పనలు (2)
మోసుక వత్తురు - విసుకక నిత్యము ప్రార్థన చేయుదము (2)
|| ప్రార్థన ||
6)
జయ జీవితము జీవించుటకై - ప్రార్థన చేయుదము (2)
ధైర్యముతో సువార్తను చాటను - ప్రార్థన చేయుదము (2)
|| ప్రార్థన ||
7)
శోధన బాధలు శ్రమలిల కల్గిన - ప్రార్థన చేయుదము (2)
ప్రార్థన బ్రతుకే ఇహపర సుఖమౌ - పావన పరమదియే (2)
|| ప్రార్థన ||
English   Praarthana Minchina Bhaagyamu
Chorus
Praarthana Minchina Bhaagyamuledu Praarthintamu Randi (2)
Mana Prabhuyesu Jeevitamantaa Praarthanalo Gadipen (2)
1)
Mana Prabhuyesu Jeevitamu - Bahuvedana Rodanato (2)
Paapularakshana Korukonen - Tana Praanamu Balichesen (2)
|| Praarthana ||
2)
Sukhajeevanamu Pondutaku - Mari Nemmadigaa Bratukan (2)
Raajula Korakai Prajalandarikai Praarthana Cheyudamu (2)
|| Praarthana ||
3)
Aatmala Rakshanakai Vilapinchi - Praarthana Cheyudamu (2)
Aatmala Bhadratakai Manamika - Vignaapana Cheyudamu (2)
|| Praarthana ||
4)
Iruvadi Naluguru Peddalayodda - Suvarna Paatralalo (2)
Bhaktulu Chesina Praarthanalundunu - Praarthinchanu Randi (2)
|| Praarthana ||
5)
Kanneetito Vaakyamuto Vittina - Santoshamuto Panalu (2)
Mosuka Vatturu - Visukaka Nityamu Praarthana Cheyudamu (2)
|| Praarthana ||
6)
Jaya Jeevitamu Jeevinchutakai - Praarthana Cheyudamu (2)
Dhairyamuto Suvaartanu Chaatanu - Praarthana Cheyudamu (2)
|| Praarthana ||
7)
Sodhana Baadhalu Sramalila Kalgina - Praarthana Cheyudamu (2)
Praarthana Bratuke Ihapara Sukhamau - Paavana Paramadiye (2)
|| Praarthana ||
Present