తెలుగు కరుణా పీరమే శరణు
పల్లవికరుణాపీఠమే శరణు - కనికరమును కోరుదుము
కృపగల సింహాసనమున్ - ధైర్యముతో చేరుదుము
1)ఊహించినది కొంత - ఊహించనిది ఎంతో
తలచియున్నది కొంత - తలచకున్నది ఎంతో
అడుగుచున్నది కొంత - అడుగకున్నది ఎంతో
మితిలేక అధికముగ - దయచేయుటయే వింత
|| కరుణా ||
2)కొండలను లోయలుగా - లోయలను కొండలుగా
పల్లమును మెట్టగా - మెట్టలను పల్లముగా
వంకరను తిన్నగా - కరుకులను నున్నగా
సర్వమును సమముగా - సరిచేయు క్రమముగా
|| కరుణా ||
3)చీకటిని వెలుగుగా - మారాను మధురముగా
కష్టమును సుఖముగా - భారమును తేలికగా
నిట్టూర్పును నాట్యముగా - మరణమును జీవముగా
మార్చుటకు శక్తిగల - మిగ్దోలును చేరుదము
|| కరుణా ||
4)మంటి పాత్రలయందు - మహిమైశ్వర్యము పోసి
శృంగారమైనట్టి - బంగారు పాత్రలుగా
వెండియు కర్రవియు - ఘనమైన పాత్రలుగా
దిద్ది తీర్చుచునున్న - పరమ కుమ్మరి ప్రభువే
|| కరుణా ||
5)ఆకోరు లోయలలో - నిరీక్షణ నాటెడిది
మోరియా పొదలలో - పొట్టేలును దాచెడిది
రాత్రిలో వెన్నెలను - ఇరుకులో వన్నెలను
ప్రభువై కన్నులకు - చూపించి రూపించు
|| కరుణా ||
6)ప్రార్థనలు స్తోత్రములు - యాచన విజ్ఞాపనలు
చందన జటామాంసి - గంధపు సాంబ్రాణులుగా
పరిశుద్ధుల ప్రార్థనలే - నైవేద్యపు ధూపముగా
పరిమళ సంభారముతో - పైకెగసెను పొగలేచి
|| కరుణా ||
7)చెఱసాల తెరుచునది - సంకెళ్ళు విరుచునది
ఆకాశము మూయునది - అగ్నిని కురిపించునది
కోటలను కూల్చునది - కేసరిని చీల్చునది
ఎన్నెన్నో చేసినది - ఎన్నెన్నో చేయునది
|| కరుణా ||
English Karunaa Peerame Sharanu
ChorusKarunaapeethame Saranu - Kanikaramunu Korudumu
Krupagala Sinhaasanamun - Dhairyamuto Cherudumu
1)Oohinchinadi Konta - Oohinchanidi Ento
Talachiyunnadi Konta - Talachakunnadi Ento
Aduguchunnadi Konta - Adugakunnadi Ento
Mitileka Adhikamuga - Dayacheyutaye Vinta
|| Karunaa ||
2)Kondalanu Loyalugaa - Loyalanu Kondalugaa
Pallamunu Mettagaa - Mettalanu Pallamugaa
Vankaranu Tinnagaa - Karukulanu Nunnagaa
Sarvamunu Samamugaa - Saricheyu Kramamugaa
|| Karunaa ||
3)Cheekatini Velugugaa - Maaraanu Madhuramugaa
Kashtamunu Sukhamugaa - Bhaaramunu Telikagaa
Nittoorpunu Naatyamugaa - Maranamunu Jeevamugaa
Maarchutaku Saktigala - Migdolunu Cherudamu
|| Karunaa ||
4)Manti Paatralayandu - Mahimaisvaryamu Posi
Srngaaramainatti - Bangaaru Paatralugaa
Vendiyu Karraviyu - Ghanamaina Paatralugaa
Diddi Teerchuchununna - Parama Kummari Prabhuve
|| Karunaa ||
5)Aakoru Loyalalo - Nireekshana Naatedidi
Moriyaa Podalalo - Pottelunu Daachedidi
Raatrilo Vennelanu - Irukulo Vannelanu
Prabhuvai Kannulaku - Choopinchi Roopinchu
|| Karunaa ||
6)Praarthanalu Stotramulu - Yaachana Vignaapanalu
Chandana Jataamaansi - Gandhapu Saanbraanulugaa
Parisuddhula Praarthanale - Naivedyapu Dhoopamugaa
Parimala Sanbhaaramuto - Paikegasenu Pogalechi
|| Karunaa ||
7)Cherasaala Teruchunadi - Sankellu Viruchunadi
Aakaasamu Mooyunadi - Agnini Kuripinchunadi
Kotalanu Koolchunadi - Kesarini Cheelchunadi
Ennenno Chesinadi - Ennenno Cheyunadi
|| Karunaa ||