తెలుగు ప్రార్థన నేర్పుము ప్రభువా
పల్లవిప్రార్థన నేర్పుము ప్రభువా
నీ ఆత్మయందు సార్థకంబగు - ధూపము వేయుట నేర్పుమయా
1)నీ నామములో ప్రార్థనలు - ఎనోషు పుట్టిననాడే
ప్రారంభమాయెను ప్రియయేసూ - నీ నామము లేనిది ప్రార్థనయా
|| ప్రార్థన ||
2)నీతో నడచిన హనోకు - నోవహు అబ్రహాములతో
దావీదనెడి మా పితరుండు - దీవెనకరముగ నడిచెనుగా
|| ప్రార్థన ||
3)సముద్రము జీల్చిన మోషేయు - సూర్యుని నిలిపిన యెహోషువా
మూడున్నర వత్సరములుగా - వర్షము నిలిపిన ఏలీయా
|| ప్రార్థన ||
4)రక్షణ పొందిన వారలము - అనుక్షణ మానందింతముగా
కన్నీటి ప్రార్థన తప్పదని - పంతము పట్టిన ఫలమేది ?
|| ప్రార్థన ||
5)హన్నా ప్రార్థించెనుగాని - సంఘములోనా? కాదుగదా
వేదము తేటగ వ్రాయబడ - అవివేకపు వాదములేల ?
|| ప్రార్థన ||
6)పాపము లోపల దాచుకొని - కడుపులు చాటుగ నింపుకొని
వేషముగా ఉపవాసముతో - ప్రార్థన చేయుట సార్థకమా?
|| ప్రార్థన ||
7)గంటల తరబడి ప్రార్థనలే - వెంటనే జవాబిచ్చునని
భక్తికి మూలము ననుకొనక - క్లుప్తముగా యుక్తముగాను
|| ప్రార్థన ||
English Praarthana Nerpumu Prabhuvaa
ChorusPraarthana Nerpumu Prabhuvaa
Nee Aatmayandu Saarthakanbagu - Dhoopamu Veyuta Nerpumayaa
1)Nee Naamamulo Praarthanalu - Enoshu Puttinanaade
Praaranbhamaayenu Priyayesoo - Nee Naamamu Lenidi Praarthanayaa
|| Praarthana ||
2)Neeto Nadachina Hanoku - Novahu Abrahaamulato
Daaveedanedi Maa Pitarundu - Deevenakaramuga Nadichenugaa
|| Praarthana ||
3)Samudramu Jeelchina Mosheyu - Sooryuni Nilipina Yehoshuvaa
Moodunnara Vatsaramulugaa - Varshamu Nilipina eleeyaa
|| Praarthana ||
4)Rakshana Pondina Vaaralamu - Anukshana Maanandintamugaa
Kanneeti Praarthana Tappadani - Pantamu Pattina Phalamedi ?
|| Praarthana ||
5)Hannaa Praarthinchenugaani - Sanghamulonaa? Kaadugadaa
Vedamu Tetaga Vraayabada - Avivekapu Vaadamulela ?
|| Praarthana ||
6)Paapamu Lopala Daachukoni - Kadupulu Chaatuga Ninpukoni
Veshamugaa Upavaasamuto - Praarthana Cheyuta Saarthakamaa?
|| Praarthana ||
7)Gantala Tarabadi Praarthanale - Ventane Javaabichchunani
Bhaktiki Moolamu Nanukonaka - Kluptamugaa Yuktamugaanu
|| Praarthana ||