తెలుగు ప్రభు యేసు నా రక్షకా
పల్లవిప్రభు యేసు నారక్షకా - నొసగు కన్నులు నాకు - నిరతము
నేనిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓ మేగయు నీవే
1)ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసూ -
నీ స్వరూపము - ప్రియమార జూచి - బహుధన్యుడాయె
ప్రియప్రభు నిన్ను జూడనిమ్ము
|| ప్రభు ||
2)లెక్కలేని మార్లు - పడిపోతిని - దిక్కులేనివాడ - నేనైతిని
చక్కజేసి నానేత్రాలు దెరచి - గ్రక్కున నిన్ను జూడనిమ్ము
|| ప్రభు ||
3)ఎఱిగి ఎఱిగి - నే చెడిపోతిని - యేసూ - నీ గాయము రేపితిని
మోసపోతి నేను దృష్టి దొలగితి - దాసుడ నన్ను జూడనిమ్ము
|| ప్రభు ||
4)ఎందరేసుని వైపు - చూచెదరో - పొందెదరు వెల్గుఁ ముఖమున
సందియంబు లేక - సంతోషించుచు - ముందుకు పరుగెత్తెదరు.
|| ప్రభు ||
5)విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడ - యేసు ప్రభూ
వినయముతో నేను నీవైపు జూచుచు విసుగక - పరుగెత్త నేర్పు
|| ప్రభు ||
6)కంటికి కనపడని వెన్నియో - చెవికి వినబడనివెన్నియో
హృదయగోచరము - కాని వెన్నియో - సిద్ధపరచితివానాకై
|| ప్రభు ||
7)లోక భోగాలపై - నా నేత్రాలు - సోకకుండునట్లు - కృపజూపుము
నీ మహిమ దివ్య - స్వరూపమును - నిండార నను జూడనిమ్ము
|| ప్రభు ||
English Prabhu Yesu Naa Rakshakaa
ChorusPrabhu Yesu Naarakshakaa - Nosagu Kannulu Naaku - Niratamu
Neninnu Jooda - Alphayu Neeve - O Megayu Neeve
1)Priyudaina Yohaanu Patmaasulo - Priyamaina Yesoo -
Nee Svaroopamu - Priyamaara Joochi - Bahudhanyudaaye
Priyaprabhu Ninnu Joodanimmu
|| Prabhu ||
2)Lekkaleni Maarlu - Padipotini - Dikkulenivaada - Nenaitini
Chakkajesi Naanetraalu Derachi - Grakkuna Ninnu Joodanimmu
|| Prabhu ||
3)Erigi Erigi - Ne Chedipotini - Yesoo - Nee Gaayamu Repitini
Mosapoti Nenu Drushti Dolagiti - Daasuda Nannu Joodanimmu
|| Prabhu ||
4)Endaresuni Vaipu - Choochedaro - Pondedaru Velgun Mukhamuna
Sandiyanbu Leka - Santoshinchuchu - Munduku Parugettedaru.
|| Prabhu ||
5)Visvaasakartaa - O Yesu Prabhoo - Konasaaginchuvaada - Yesu Prabhoo
Vinayamuto Nenu Neevaipu Joochuchu Visugaka - Parugetta Nerpu
|| Prabhu ||
6)Kantiki Kanapadani Venniyo - Cheviki Vinabadanivenniyo
Hrudayagocharamu - Kaani Venniyo - Sidhaparachitivaanaakai
|| Prabhu ||
7)Loka Bhogaalapai - Naa Netraalu - Sokakundunatlu - Krupajoopumu
Nee Mahima Divya - Svaroopamunu - Nindaara Nanu Joodanimmu
|| Prabhu ||