తెలుగు నీ పాద సన్నిధికి
పల్లవినీ పాద సన్నిధికి - కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు - దేవ నే వచ్చితిని
1)విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా
సిలువయే నా ఆశ్రయము - హాయిగానచటుండెదను
|| నీ పాద ||
2)ప్రార్థించ మంటివి ప్రభువా - సంకట సమయములో
దయజుూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా
|| నీ పాద ||
3)నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము
మనసార ప్రార్థించుచు - యేసు నీ దరి చేరెదను
|| నీ పాద ||
4)నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను
నీకై సహించెదనంత - నీ బలము నాకిమ్ము
|| నీ పాద ||
5)ఆశతో నీ ముఖమును - నాసక్తితో చూడ
సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ
|| నీ పాద ||
6)శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు
నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము
|| నీ పాద ||
7)జీవించి ఎదుగునట్లు జయ - జీవితంబిమ్ము
ఫలించి వర్ధిల్లుటకై - ప్రభువా నీ కృపనిమ్ము
|| నీ పాద ||
8)సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా
కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను
|| నీ పాద ||
English Nee Paada Sannidhiki
ChorusNee Paada Sannidhiki - Krupaamayaa Yesayyaa
Nee Prema Kanugonuchu - Deva Ne Vachchitini
1)Visraanti Nichchedu Devaa - Sramalella Teerchumayyaa
Siluvaye Naa Aasrayamu - Haayigaanachatundedanu
|| Nee Paada ||
2)Praarthincha Mantivi Prabhuvaa - Sankata Samayamulo
Dayajuoopi Nanu Karuninchi - Premato Aadarinchumayyaa
|| Nee Paada ||
3)Naramaatrudavu Neevu Kaavu - Mora Naalakinchumu
Manasaara Praarthinchuchu - Yesu Nee Dari Cheredanu
|| Nee Paada ||
4)Nannu Cheyi Viduvaku Naathaa - Nindalenno Pondinanu
Neekai Sahinchedananta - Nee Balamu Naakimmu
|| Nee Paada ||
5)Aasato Nee Mukhamunu - Naasaktito Chooda
Siggupadanugaa Nenu - Nee Prakaasamu Naapai Nunda
|| Nee Paada ||
6)Satruvu Nodinchutaku - Nee Saktini Choopu
Nannaadarinchi Neevu - Aavarinchi Kaapaadumu
|| Nee Paada ||
7)Jeevinchi Edugunatlu Jaya - Jeevitanbimmu
Phalinchi Vardhillutakai - Prabhuvaa Nee Krupanimmu
|| Nee Paada ||
8)Seeyonu Moolaraayi - Ayyunna O Prabhuvaa
Kalatanu Chendaka Nenu - Neekai Kanipettedanu
|| Nee Paada ||