Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 435 Old No: 269

నిన్ను నేను విడువను దేవా

Ninnu Neenu Viduvanu Devaa

Open in Word & Worship App
తెలుగు   నిన్ను నేను విడువను దేవా
పల్లవి
నిన్ను నేను విడువను దేవ - నీవు నను దీవించు వఱకు
నిన్ను నమ్మిన వారల నెల్ల - నీవు చక్కఁగ దీవించెదవు
1)
నేను శత్రువునై యుండంగ - నీవు నాపై నెవరు జూపి
దాన మిచ్చితివి నా కొఱకు - దారుఁడౌ నీ ప్రియ పుత్రుని
|| ని ||
2)
త్రోవ దప్పి తిరుగుచుండ - దుడుకునైన నన్నుఁ గాంచి
ప్రోవఁగోరి మదిని నీవు - త్రోవను బెట్టితివి నన్ను
|| ని ||
3)
నాఁట నుండి నేఁటి వఱకు - నాకుఁ గల్గిన శోధనములలో
నేటుగా ననుఁగాచిన వాఁడవు - నీవు గావా, ఓ నా తండ్రి
|| ని ||
4)
ఇంతకాలము నన్నుఁగాచి - యిఁకను నన్ను విడువ వనుచు
సంతసించి మదిని నేను - జక్కఁగ నీ దరిజేరితిని
|| ని ||
5)
నీవు గాక యెవరున్నారు - నేలపైని ననుఁ గాపాడఁ
చేవ లేని నాకు నీవు - చేవ గలుగఁ జేయం గలవు
|| ని ||
6)
అడుగు వారి కిచ్చెద నంచు - నాన తిచ్చినావు గాన
నడిగెద నిను సాహాయ్యంబు - నాత్మవై యున్నట్టి తండ్రి
|| ని ||
7)
నాదు ప్రార్థన లన్నియు నీవు - నీదు కృపచే నాలకించి
నీదు సరణిని నిల్చి నన్ను - నేర్పు దనరఁగ రక్షించితివి
|| ని ||
English   Ninnu Neenu Viduvanu Devaa
Chorus
Ninnu Nenu Viduvanu Deva - Neevu Nanu Deevinchu Varaku
Ninnu Nammina Vaarala Nella - Neevu Chakkanga Deevinchedavu
1)
Nenu Satruvunai Yundanga - Neevu Naapai Nevaru Joopi
Daana Michchitivi Naa Koraku - Daarundau Nee Priya Putruni
|| Ni ||
2)
Trova Dappi Tiruguchunda - Dudukunaina Nannun Gaanchi
Provangori Madini Neevu - Trovanu Bettitivi Nannu
|| Ni ||
3)
Naanta Nundi Nenti Varaku - Naakun Galgina Sodhanamulalo
Netugaa Nanungaachina Vaandavu - Neevu Gaavaa, O Naa Tandri
|| Ni ||
4)
Intakaalamu Nannungaachi - Yinkanu Nannu Viduva Vanuchu
Santasinchi Madini Nenu - Jakkanga Nee Darijeritini
|| Ni ||
5)
Neevu Gaaka Yevarunnaaru - Nelapaini Nanun GaapaadaM
Cheva Leni Naaku Neevu - Cheva Galugan Jeyan Galavu
|| Ni ||
6)
Adugu Vaari Kichcheda Nanchu - Naana Tichchinaavu Gaana
Nadigeda Ninu Saahaayyanbu - Naatmavai Yunnatti Tandri
|| Ni ||
7)
Naadu Praarthana Lanniyu Neevu - Needu Krupache Naalakinchi
Needu Saranini Nilchi Nannu - Nerpu Danaranga Rakshinchitivi
|| Ni ||
Present