Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 432 Old No: 262

నీ వాత్మ యుద్ధములో

Nee Vaatma Yuddhaamulo

Open in Word & Worship App
తెలుగు   నీ వాత్మ యుద్ధములో
పల్లవి
నీ వాత్మ యుద్ధములో - జయమొందుము - ఓ నా సోదరా
వెనుకంజ వేయకు - ఓ నా సోదరీ వెనుకంజ వేయకు
1)
స్వామి యేసు తన సిలువను మోసి - సైతాను రాజ్యమును
పూర్తిగా జయించెన్‌ - నీవును యేసుని వెంబడివెళ్ళుమా
|| ఓ ||
2)
శిరమున ముండ్లమకుటము ధరించి - సిపాయిచే తలపై
కొట్టబడె - నీవును యేసుని వెంబడివెళ్ళుమా
|| ఓ ||
3)
కల్వరిపైన ఒంటరిగానే - వెళ్ళెను యేసు
త్యాగసహితుడై - నీవును ఆ దారినే వెళ్ళుమా
|| ఓ ||
4)
లోకస్తులంతా నిద్రించుచుండగా - మోకాళ్ళపై యేసు
కొండపై నుండె - నీవును ప్రార్థన శక్తి నొందుమా
|| ఓ ||
5)
సాహసమున నీ - వాత్మ ఖడ్గమున - సైతానుబంధము
ఖండించివేసి - క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా
|| ఓ ||
English   Nee Vaatma Yuddhaamulo
Chorus
Nee Vaatma Yudhamulo - Jayamondumu - O Naa Sodaraa
Venukanja Veyaku - O Naa Sodaree Venukanja Veyaku
1)
Svaami Yesu Tana Siluvanu Mosi - Saitaanu Raajyamunu
Poortigaa Jayinchen - Neevunu Yesuni Venbadivellumaa
|| O ||
2)
Siramuna Mundlamakutamu Dharinchi - Sipaayiche Talapai
Kottabade - Neevunu Yesuni Venbadivellumaa
|| O ||
3)
Kalvaripaina Ontarigaane - Vellenu Yesu
Tyaagasahitudai - Neevunu Aa Daarine Vellumaa
|| O ||
4)
Lokastulantaa Nidrinchuchundagaa - Mokaallapai Yesu
Kondapai Nunde - Neevunu Praarthana Sakti Nondumaa
|| O ||
5)
Saahasamuna Nee - Vaatma Khadgamuna - Saitaanubandhamu
Khandinchivesi - Kreestuni Sanghamaa - Mundanja Veyumaa
|| O ||
Present