Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 43 Old No: 62

స్తుతి స్తోత్ర గీతము

Sthuthi Stotra Geetamu

♪ M.David Rajkumar
Open in Word & Worship App
తెలుగు   స్తుతి స్తోత్ర గీతము
పల్లవి
స్తుతి స్తోత్రగీతము - ప్రభుయేసుకే పాడెదము
1)
ఎంచనలవి కానివి - వింతైన యేసు మేలులు
అంతులేని తన ప్రేమచే - సంకటములన్ని దీర్చెను
|| స్తుతి ||
2)
పరము నుండి ధరలోకి - నరుల పాపపరిహారముకై
వరసుతుడై వెలసెనేసు - కరములెత్తి కీర్తించెదము
|| స్తుతి ||
3)
ఖలుల కోసమై పలుశ్రమలు - సిలువపై నాథుడు బొందెను
విలువైన తన రక్తము - బలిగ బెట్టి తలవాల్చెను
|| స్తుతి ||
4)
మరణ మొందెను పరిశుద్ధుడు - మరల లేచె తన మహిమకై
పరము వెళ్ళెను పురముకై - తిరిగివచ్చి తన పురము జేర్చున్‌
|| స్తుతి ||
5)
సాటిలేని గొప్ప దేవుడు - నేటి మన ప్రభుయేసుడు
కోటి సూర్యుల కాంతికన్నా - మేటియని స్తుతియింతుము
|| స్తుతి ||
English   Sthuthi Stotra Geetamu
Chorus
Sthuthi Stotrageetamu - Prabhuyesuke Paadedamu
1)
Enchanalavi Kaanivi - Vintaina Yesu Melulu
Antuleni Tana Premache - Sankatamulanni Deerchenu
|| Sthuthi ||
2)
Paramu Nundi Dharaloki - Narula Paapaparihaaramukai
Varasutudai Velasenesu - Karamuletti Keertinchedamu
|| Sthuthi ||
3)
Khalula Kosamai Palusramalu - Siluvapai Naathudu Bondenu
Viluvaina Tana Raktamu - Baliga Betti Talavaalchenu
|| Sthuthi ||
4)
Marana Mondenu Parisuddhudu - Marala Leche Tana Mahimakai
Paramu Vellenu Puramukai - Tirigivachchi Tana Puramu Jerchun
|| Sthuthi ||
5)
Saatileni Goppa Devudu - Neti Mana Prabhuyesudu
Koti Sooryula Kaantikannaa - Metiyani Sthuthiyintumu
|| Sthuthi ||
Present