తెలుగు ప్రార్థన వినెడి పావనుడా
పల్లవిప్రార్థన వినెడి పావనుడా - ప్రార్థన మాకు నేర్పుమయా
1)శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి - పరముడ
నిను ప్రణుతించెద ప్రియముగ - ప్రార్థన చేయుట నేర్పుమయా
|| ప్రార్థన ||
2)పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగమోడ్చి
శిరమునువంచి - సరిగను వేడిన - సుంకరి ప్రార్థన నేర్పుమయా
|| ప్రార్థన ||
3)దినములోన చేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ
దీనుడవయ్యు ఒంటిగ కొండపై - చేసిన ప్రార్థన నేర్పుమయా
|| ప్రార్థన ||
4)శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపైని నిను జంపగను
శాంతముతో నీ శత్రులబ్రోవగ - సలిపిన ప్రార్థన నేర్పుమయా
|| ప్రార్థన ||
English Praarthana Vinedi Paavanudaa
ChorusPraarthana Vinedi Paavanudaa - Praarthana Maaku Nerpumayaa
1)Sreshthamaina Bhaavamu Goorchi - Sishyabrndamuku Nerpitivi - Paramuda
Ninu Pranutincheda Priyamuga - Praarthana Cheyuta Nerpumayaa
|| Praarthana ||
2)Parama Devudavani Telisi Karamuletti Jantagamodchi
Siramunuvanchi - Sariganu Vedina - Sunkari Praarthana Nerpumayaa
|| Praarthana ||
3)Dinamulona Chesina Seva - Daivachittamuku Saripova
Deenudavayyu Ontiga Kondapai - Chesina Praarthana Nerpumayaa
|| Praarthana ||
4)Satrumooka Ninu Chuttukoni - Siluvapaini Ninu Janpaganu
Saantamuto Nee Satrulabrovaga - Salipina Praarthana Nerpumayaa
|| Praarthana ||