తెలుగు ఓ ప్రార్థన సుప్రార్థన
పల్లవిఓ ప్రార్థనా సుప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖాముఖిన్ - నేఁ బ్రణుతింతు నీ ప్రభున్
నా ప్రాణమా సుప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధారఁ గ్రోలుదున్ - ఓ ప్రార్థనా సుప్రార్థనా
1)పిశాచి నన్ను యుక్తితో - వశంబు చేయఁజూచునో
నీ శాంతమైన దీప్తియే - నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
నా శోక మెల్లఁ దీర్చెడు - విశేషమైన ప్రార్థనా
|| ఓ ||
2)నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభార మెల్లను
నా దేవుఁడేసు చెంతకు - మోదంబుఁ గొంచుఁబోవును
సదా శుభంబు లొందను - విధంబుఁ జూప నీవెగా
నాధైర్య మిచ్చు ప్రార్థనా - సుధా సుధార ప్రార్థనా
|| ఓ ||
3)అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా - చిరగ్భృహంబుఁ జూతును
శరీరమున్ - విదల్చినేం - బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ - పరేశు ధ్యాన ప్రార్థనా
|| ఓ ||
English O Praarthana Supraarthana
ChorusO Praarthanaa Supraarthanaa - Nee Praabhavanbun Maratunaa?
Naa Prabhuvun Mukhaamukhin - Nen Branutintu Nee Prabhun
Naa Praanamaa Supraarthanaa - Nee Prerananbuche Gadaa
Nee Premadhaaran Groludun - O Praarthanaa Supraarthanaa
1)Pisaachi Nannu Yuktito - Vasanbu Cheyanjoochuno
Nee Saantamaina Deeptiye - Naa Sanka Lella Maanupun
Nee Sakti Nenu Maratunaa - Naa Sailamaina Praarthanaa
Naa Soka Mellan Deerchedu - Viseshamaina Praarthanaa
|| O ||
2)Nee Divyamaina Rekkale - Naa DuHkhabhaara Mellanu
Naa Devundesu Chentaku - Modanbun Gonchunbovunu
Sadaa Subhanbu Londanu - Vidhanbun Joopa Neevegaa
Naadhairya Michchu Praarthanaa - Sudhaa Sudhaara Praarthanaa
|| O ||
3)Aranyamaina Bhoomilo - Naa Ramyamau Pisgaa Nagam
Bu Rangugaanu Nekki Naa - Chiragbhruhanbun Jootunu
Sareeramun - Vidalchinen - Baranbu Bovu Velalo
Karanbu Ninnu Mechchedan - Paresu Dhyaana Praarthanaa
|| O ||