తెలుగు మహిమగల వాక్యము
పల్లవిమహిమగల వాక్యము మాజిహ్వకు మధురము - యేసయ్యా
నీ మాటలు బంగారపు మూటలు - నీ వాక్యము చేతనే
మమ్ము బ్రతికించితివి స్తోత్రముల్
1)వాక్యంబనెడు నామము గలిగి - వాక్యము చేతనే సృష్టినిజేసి
వాక్యముతోనే జీవము నిచ్చి - మృతులబ్రతికించితివి నీ
జీవము మాకిచ్చితివి
2)తేనెకంటె తియ్యని వాక్యం - పాలకంటే పావన వాక్యం
నీటికంటే నిర్మలవాక్యం - హెచ్చరికనిచ్చును
లాభము కలిగించును
3)దివారాత్రులు వాక్యధ్యానం - ధన్యతనిచ్చును దీవెననిచ్చును
చేయునదంతా సఫలము చేయును - దృష్టిని కలిగించును
దృఢపరచును ఆత్మను
4)బలము కలది నీ వాక్యంబు - బలపరచును భక్తిపరులను
బాధలను తీయును బోధలు చేయును భయమును పొగొట్టును
బహుక్షేమము నిచ్చును
5)దుష్టుని అగ్ని బాణములను - ద్రుంచుటకొరకై దోష హరీ
దేవా వాక్య ఖడ్గమునిచ్చితి - ధైర్యము చేకూర్చితివి
దీనుల కండైతివి
6)మా పాదములకు దీపమునీవే - మా త్రోవలకు వెలుగువు నీవే
మా బాధలలో ఆశ్రయమీవే - మండించుము ఆత్మతో మమ్ము
వెలిగించలోకంబును
English Mahimagala Vakyamu
ChorusMahimagala Vaakyamu Maajihvaku Madhuramu - Yesayyaa
Nee Maatalu Bangaarapu Mootalu - Nee Vaakyamu Chetane
Mammu Bratikinchitivi Stotramul
1)Vaakyanbanedu Naamamu Galigi - Vaakyamu Chetane Srushtinijesi
Vaakyamutone Jeevamu Nichchi - Mrtulabratikinchitivi Nee
Jeevamu Maakichchitivi
2)Tenekante Tiyyani Vaakyan - Paalakante Paavana Vaakyam
Neetikante Nirmalavaakyan - Hechcharikanichchunu
Laabhamu Kaliginchunu
3)Divaaraatrulu Vaakyadhyaanan - Dhanyatanichchunu Deevenanichchunu
Cheyunadantaa Saphalamu Cheyunu - Drushtini Kaliginchunu
Drudhaparachunu Aatmanu
4)Balamu Kaladi Nee Vaakyanbu - Balaparachunu Bhaktiparulanu
Baadhalanu Teeyunu Bodhalu Cheyunu Bhayamunu Pogottunu
Bahukshemamu Nichchunu
5)Dushtuni Agni Baanamulanu - Drunchutakorakai Dosha Haree
Devaa Vaakya Khadgamunichchiti - Dhairyamu Chekoorchitivi
Deenula Kandaitivi
6)Maa Paadamulaku Deepamuneeve - Maa Trovalaku Veluguvu Neeve
Maa Baadhalalo Aasrayameeve - Mandinchumu Aatmato Mammu
Veliginchalokanbunu