తెలుగు నా హృదయము ఎంతో
పల్లవినా హృదయము ఎంతో సంతోషించెగా - నా ప్రభువును గూర్చి రచించిన
దానిని పాడగా - స్తోత్రించి ఘనపరతును స్వామి యేసుని
అతి సుందరుడైనట్టి అద్వితీయుని
1)నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించె -
అందులకై తండ్రి నిన్ను అతిగా హెచ్చించె
ఆనందతైలముతో అభిషేకించె
ఆయననే అనవరతం ఆరాధింతున్
|| నా ||
2)వినయ సత్య భరితంబగు నీతిని స్థాపించ
ప్రభావ తేజంబులను ప్రభువే ధరియించ
మేఘంబే వాహనముగ ఆశీనుండై
ఆగమనము నాకెంతో ఆదరణగా
|| నా ||
3)సర్వాంగ సుందరియగు సంఘములోనుండ
సుందరుడేసే నా అందమును కోరియుండ
అపరంజి ఆభరణముల లంకరించి
అంతఃపురములోనికి ఆయనతో వెళ్ళెదన్
|| నా ||
4)సంఘ వధువుగా ఎదురు చూచెడి నా కొరకై
రాజుల రాజైన క్రీస్తు వరుడుగా రానుండె
రాజిల్లెడు చిత్రంబగు రాజవస్త్ర శోభితనై
రాజ నగరులో నేను రాణిగ శోభిల్లెదన్
|| నా ||
5)ప్రభువా నిరతము నిలుచును నీ సింహాసనము
దేవా నిత్యంబుండును నీ రాజ దండము
కన్నులార నిన్నుజూతు నెన్ని యుగములో
అన్న యేసు నీకివే నా స్తుతి స్తోత్రముల్
|| నా ||
English Naa Hrdayamu Emto
ChorusNaa Hrudayamu Ento Santoshinchegaa - Naa Prabhuvunu Goorchi Rachinchina
Daanini Paadagaa - Stotrinchi Ghanaparatunu Svaami Yesuni
Ati Sundarudainatti Adviteeyuni
1)Neetini Preminchi Durneetini Dveshinche -
Andulakai Tandri Ninnu Atigaa Hechchinche
Aanandatailamuto Abhishekinche
Aayanane Anavaratan Aaraadhintun
|| Naa ||
2)Vinaya Satya Bharitanbagu Neetini Sthaapincha
Prabhaava Tejanbulanu Prabhuve Dhariyincha
Meghanbe Vaahanamuga Aaseenundai
Aagamanamu Naakento Aadaranagaa
|| Naa ||
3)Sarvaanga Sundariyagu Sanghamulonunda
Sundarudese Naa Andamunu Koriyunda
Aparanji Aabharanamula Lankarinchi
AntaHpuramuloniki Aayanato Velledan
|| Naa ||
4)Sangha Vadhuvugaa Eduru Choochedi Naa Korakai
Raajula Raajaina Kreestu Varudugaa Raanunde
Raajilledu Chitranbagu Raajavastra Sobhitanai
Raaja Nagarulo Nenu Raaniga Sobhilledan
|| Naa ||
5)Prabhuvaa Niratamu Niluchunu Nee Sinhaasanamu
Devaa Nityanbundunu Nee Raaja Dandamu
Kannulaara Ninnujootu Nenni Yugamulo
Anna Yesu Neekive Naa Sthuthi Stotramul
|| Naa ||