Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 419 Old No: 552

నీ వాక్యమే నన్ను బ్రతికిం

Nee Vakyame Nannu Bratikim

Open in Word & Worship App
తెలుగు   నీ వాక్యమే నన్ను బ్రతికిం
పల్లవి
నీ వాక్యమే నన్ను బ్రతికించెను - బాధలలో నెమ్మది నిచ్చెను (2సార్లు)
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా
1)
జిగట గల ఊబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను
|| నీ ||
2)
శతృవులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధమనస్సు ఇచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని బాణములను
ఖడ్గంవలె అడ్డుకొని ఆపివేయచున్నది
|| నీ ||
3)
పాలవంటిది జుంటి తేనె వంటిది - నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారు కన్న మిన్నయైనది
రత్నరాసుల కన్న కోరతగినది
|| నీ ||
English   Nee Vakyame Nannu Bratikim
Chorus
Nee Vaakyame Nannu Bratikinchenu - Baadhalalo Nemmadi Nichchenu\n(2saarlu)\nKrupaasakti Dayaasakti Sanpoornudaa\nVaakyamaiyunna Yesu Vandanamayyaa
1)
Jigata Gala Oobi Nundi Levanettenu\nSamatalamagu Bhoomipai Nannu Nilipenu\nNaa Paadamulaku Deepamaayenu\nSatyamaina Maargamulo Nadupuchundenu
2)
Satruvulanu Edurkone Sarvaanga Kavachamai\nYudhamunaku Sidhamanassu Ichchuchunnadi\nApavaadi Veyuchunna Agni Baanamulanu\nKhadganvale Addukoni Aapiveyachunnadi
3)
Paalavantidi Junti Tene Vantidi - Naa Jihvaku Mahaa Madhuramainadi\nMelimi Bangaaru Kanna Minnayainadi\nRatnaraasula Kanna Korataginadi
Present