తెలుగు కురిపించుము దేవా
పల్లవికురిపించుము దేవా - నీ వాక్యము తొలకరి వర్షముగా
నీ మెండగు ప్రేమ ప్రవాహమును - మరి దండిగ పారించు
1)ఎండిన భూమి ఎడారులను - బండగు మొండి హృదయములన్
నీవు పండించు మరి నిండించు - నీదు వాక్యబలముతోడన్
|| కురి ||
2)చక్కనిదగు నీదు సారమును - మక్కువతో మది నింపుకొని
మే మెక్కడున్న అతి నిక్కముగ - నీదు మొక్కలై జీవింప (3)
|| కురి ||
3)మహిలో నా నవ జీవితము - మాధుర్యముగా సాగిపోవ
నను స్థిరపరచు మరి బలపరచు - నీదు మార్గమందు నడువ
|| కురి ||
4)సత్య సువార్తను చాటించి - నిత్య రాజ్యమును స్థాపింప
నీవు నింపుమయా నీదు వాక్యముతో - యింపైన సాక్షులు గనూ
|| కురి ||
5)సుందరమగు నీదు పురమందు - విందుగ అందరము జేరి
ఆనందమగు నీదు వెలుగునందు - అనిశంబు జీవింపగను
|| కురి ||
English Kuripinchumu Devaa
ChorusKuripinchumu Devaa - Nee Vaakyamu Tolakari Varshamugaa
Nee Mendagu Prema Pravaahamunu - Mari Dandiga Paarinchu
1)Endina Bhoomi Edaarulanu - Bandagu Mondi Hrudayamulan
Neevu Pandinchu Mari Nindinchu - Needu Vaakyabalamutodan
|| Kuri ||
2)Chakkanidagu Needu Saaramunu - Makkuvato Madi Ninpukoni
Me Mekkadunna Ati Nikkamuga - Needu Mokkalai Jeevinpa (3)
|| Kuri ||
3)Mahilo Naa Nava Jeevitamu - Maadhuryamugaa Saagipova
Nanu Sthiraparachu Mari Balaparachu - Needu Maargamandu Naduva
|| Kuri ||
4)Satya Suvaartanu Chaatinchi - Nitya Raajyamunu Sthaapinpa
Neevu Ninpumayaa Needu Vaakyamuto - Yinpaina Saakshulu Ganoo
|| Kuri ||
5)Sundaramagu Needu Puramandu - Vinduga Andaramu Jeri
Aanandamagu Needu Velugunandu - Anisanbu Jeevinpaganu
|| Kuri ||