Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 414 Old No: 191

క్రీస్తుని స్వరము వినుడను

Kreestuni Svaramu Vinudanu

Open in Word & Worship App
తెలుగు   క్రీస్తుని స్వరము వినుడను
పల్లవి
క్రీస్తుని స్వరము విందును - ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది - మెల్లని స్వరమే యది
1)
యెహోవా నీ స్వరము - జలములపై వినబడెను
మహిమ గల దేవుడు - ఉరుములవలె గర్జించెను
|| క్రీస్తుని ||
2)
బలమైన నీ స్వరము - బహు ప్రభావము గలది
దేవదారుల విరచును - ప్రజ్వలింప చేయునగ్నిని
|| క్రీస్తుని ||
3)
అద్భుత ప్రభుస్వరము - అరణ్యము కదిలించును
ఆకుల రాలజేయును - లేళ్ళనీనజేయును
|| క్రీస్తుని ||
4)
ఆలయమందన్నియు - ఆయననే ఘనపరచున్‌
ఆశీర్వాదము శాంతి - నొసగు నాయన స్వరమే
|| క్రీస్తుని ||
5)
నీ మధుర స్వరము - నీ వాక్యమున విందున్‌
ప్రార్థనల యందున - ప్రతిదినము పల్కెదవు
|| క్రీస్తుని ||
6)
నీ మధుర స్వరము - నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను
|| క్రీస్తుని ||
7)
నీ మధుర స్వరము - నీ మార్గము జూపును
కుడియెడమల తిరిగినను - నీ స్వరమే వినబడును
|| క్రీస్తుని ||
8)
తుఫానులు కలిగి - భయభీతులలో నుండ
భయపడకు మని పలికె - ప్రేమగల నీ స్వరము
|| క్రీస్తుని ||
9)
మరణాంధకార - లోయలో నేనుండ
నీకు తోడైయుంటి - ననెడి స్వరమును వింటిన్‌
|| క్రీస్తుని ||
10)
ప్రభువా సెలవిమ్ము - నీ దాసుడాలించున్‌
దీనుడనై నీ మాట - అంగీకరించెదను
|| క్రీస్తుని ||
English   Kreestuni Svaramu Vinudanu
Chorus
Kreestuni Svaramu Vindunu - Prabhuve Palikinapudu
Madhura Svarameyadi - Mellani Svarame Yadi
1)
Yehovaa Nee Svaramu - Jalamulapai Vinabadenu
Mahima Gala Devudu - Urumulavale Garjinchenu
|| Kreestuni ||
2)
Balamaina Nee Svaramu - Bahu Prabhaavamu Galadi
Devadaarula Virachunu - Prajvalinpa Cheyunagnini
|| Kreestuni ||
3)
Adbhuta Prabhusvaramu - Aranyamu Kadilinchunu
Aakula Raalajeyunu - Lellaneenajeyunu
|| Kreestuni ||
4)
Aalayamandanniyu - Aayanane Ghanaparachun
Aaseervaadamu Saanti - Nosagu Naayana Svarame
|| Kreestuni ||
5)
Nee Madhura Svaramu - Nee Vaakyamuna Vindun
Praarthanala Yanduna - Pratidinamu Palkedavu
|| Kreestuni ||
6)
Nee Madhura Svaramu - Nee Chittamu Telpunu
Anudina Jeevitamulo Anusarincheda Ninnu
|| Kreestuni ||
7)
Nee Madhura Svaramu - Nee Maargamu Joopunu
Kudiyedamala Tiriginanu - Nee Svarame Vinabadunu
|| Kreestuni ||
8)
Tuphaanulu Kaligi - Bhayabheetulalo Nunda
Bhayapadaku Mani Palike - Premagala Nee Svaramu
|| Kreestuni ||
9)
Maranaandhakaara - Loyalo Nenunda
Neeku Todaiyunti - Nanedi Svaramunu Vintin
|| Kreestuni ||
10)
Prabhuvaa Selavimmu - Nee Daasudaalinchun
Deenudanai Nee Maata - Angeekarinchedanu
|| Kreestuni ||
Present